ALL TTD VEDA PATHASHALAS UNDER THE UMBRELLA OF SV VEDIC UNIVERSITY- TTD EO _ ఎస్వీ వేద వ‌ర్సిటీ ప‌రిధిలోకి టిటిడి వేద పాఠ‌శాల‌లు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirupati, 19 Jan. 21: To have a better development of Vedic Studies and academic progress, all the TTD Veda Pathashalas will be brought under the umbrella of SV Vedic Varsity said TTD Executive Officer, Dr KS Jawahar Reddy.

During a review a meeting on Vedic Studies in his chambers at TTD Administrative Building in Tirupati on Tuesday, the EO said all the Six Veda Pathashalas of TTD would soon be brought under the jurisdiction of the SV Vedic University.

A committee will be set up to frame guidelines on eligibility, selection process, admissions, syllabus, courses and, certification etc. Required for the students of Veda Pathashalas.

The committee of Vedic experts has been asked to submit their recommendations within a month.

He said bringing all Veda Pathashalas less than one umbrella will go a long way in uniformity, propagation of Vedas and high standards in Vedic education.

Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basanth Kumar, SV Vedic University Vice-Chancellor Acharya S Sudarshana Sharma, Principal of Dharmagiri Veda Vijnana Peetham, Sri KSS Avadhani, OSD of S.V Higher Vedic Studies Institute Dr Akella Vibhishana Sharma, Principals of all Six Veda Pathashalas of TTD were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఎస్వీ వేద వ‌ర్సిటీ ప‌రిధిలోకి టిటిడి వేద పాఠ‌శాల‌లు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

 తిరుపతి, 19 జనవరి 2021: తెలుగు రాష్ట్రాల్లో టిటిడి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న 6 వేద పాఠ‌శాల‌ల‌ను తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం ప‌రిధిలోకి తీసుకొస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఈవో అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ వేద విద్య‌ను అభ్య‌సించేందుకు విద్యార్థుల‌కు ఉండాల్సిన అర్హ‌త‌లు, ఎంపిక విధానం, అడ్మిష‌న్లు, పాఠ్యాంశాలు, కోర్సుల రూప‌క‌ల్ప‌న‌, స‌ర్టిఫికెట్ల ప్ర‌దానం త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి విధి విధానాలు రూపొందించేందుకు త్వ‌ర‌లో ఒక క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఈ క‌మిటీలోని పండితులు ఒక నెల లోపు నివేదిక స‌మ‌ర్పించాల‌ని సూచించారు. వేద పాఠ‌శాల‌ల‌న్నీ ఒకే గొడుగు కిందికి రావ‌డం వ‌ల్ల విద్యార్థుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని వివ‌రించారు. వేద విద్య‌ను మ‌రింత విస్తృతం చేసేందుకు ఈ విధానం ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.

ఈ స‌మావేశంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్‌, ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ‌, తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, కీస‌ర‌గుట్ట‌, చిలుకూరు, న‌ల్గొండ‌, కోట‌ప్ప‌కొండ‌, ఐ.భీమ‌వ‌రం, విజ‌య‌న‌గ‌రం వేద పాఠ‌శాల‌ల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.