TIME TO GLORIFY VEDIC SCIENCES-RENOWNED SCIENTIST AND SCHOLAR Dr OM PRAKASH PANDEY _ విశ్వం ఆవిర్భావ విషయాలు వేదాల్లో నిక్షిప్తం : డా. ఓపి.పాండే

Tirupati, 19 Jan. 21: The vast knowledge about the origin of the Universe, particles, matter etc. Which were mentioned in our ancient Vedic texts should be brought to the fore and need to focus on development Vedic sciences studies, opined renowned Scientist and Scholar Dr Om Prakash Pandey.

The exponent has delivered and extension lecture over Mystery of Universe for a couple of hours in SV Vedic University in Tirupati on Tuesday evening.

Dr Pandey said many interesting scientific research things including the formation of Universe, the Big Bang Theory, Solar Family, Matter, Particles and the studies carried out by NASA etc. and referred to many instances which were already stated in Vedic texts some thousands of years ago viz. Rig Veda, Khatopanishad

He said these Mantras in our Vedas ascertain the theories of present-day science. He also said in 1964 NASA in its research found out that Sanskrit is the only medium of language transmission from one Solar System to another as the echo produced by Sound Wave in the Solar System were syllables of Sanskrit, he added.

Expressing his concern he sought all the Vedic scholars to focus now on how to take forwards Vedic Sciences in a better way across the world and bring back our past glory to our ancient knowledge, he added.

Later he was felicitated by TTD EO Dr KS Jawahar Reddy and VC Prof. S Sudarshana Sharma. 

Additional EO Sri. AV Dharma Reddy, JEO Sri P Basanth Kumar, CVSO Sri Gopinath Jatti, Registrar of SVVU Sri Ramachandra and other senior officers of TTD, Vedic Varsity faculty and students were also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

విశ్వం ఆవిర్భావ విషయాలు వేదాల్లో నిక్షిప్తం : డా. ఓపి.పాండే

తిరుపతి, 2021 జ‌న‌వ‌రి 19: విశ్వం ఆవిర్భావం, సూర్య మండలం, భూమి లాంటి గ్రహాల స్థితిగతుల గురించిన విషయాలు వేదాల్లో నిక్షిప్తమై ఉన్నాయని, వాటిని వెలికితీసి మానవాళికి అందించాల్సిన అవసరం ఉందని ఇస్రో మాజీ శాస్త్రవేత్త డా. ఓపి.పాండే కోరారు. తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో మంగళవారం ఆయన ఖగోళ విషయాల్లో వేదాంత విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్రీ పాండే మాట్లాడుతూ ఖగోళానికి సంబంధించిన పలు అంశాలను అధర్వణ వేదం, కఠోపనిషత్ లోని విషయాలను జోడించి వివరించారు. విశ్వంలోని గ్రహాల గమనాన్ని ప్రాచీన భారతీయ అంశాలతో కలిపి చక్కగా తెలియజేశారు. నాసా శాస్త్రవేత్తలు సూర్యగోళంలోని శబ్దాన్ని రికార్డ్ చేయగా ఓంకారం వినిపించడమే భారతీయతకు నిదర్శనమన్నారు. వేద పండితులు వేదాల్లోని వైజ్ఞానిక అంశాలపై పరిశోధన జరిపి ప్రస్తుత సమాజానికి అవసరమైన ఆవిష్కరణలు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఎస్వీ వేద వ‌ర్సిటీ ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న శ‌ర్మ‌, డిఈఓ శ్రీ గోవిందరాజన్, వర్సిటీ రిజిస్టార్ శ్రీ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.