VALMIKIPURAM ANNUAL FETE FROM APRIL 12-20 _ ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వ‌ర‌కు వాల్మీకిపురం శ్రీ ప‌ట్టాభిరామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

TIRUPATI, 22 MARCH 2024: The annual Brahmotsavam in Sri Pattabhi Ramalayam at Valmikipuram will be from April 12 to 20.

Dwajarohanam in Vrishabha Lagnam will be on March 12, Kalyanotsavam and Garuda Seva on April 17 on the auspicious day of Sri Rama Navami while Rathotsavam and Dhooli Utsavam will be on April 18, Paruveta Utsavam on April 19 and Dhwajavarohanam on April 20.

On April 21, Pushpayagam will be observed.

The price of each ticket for Kalyanotsavam is Rs.500 on which two persons will be allowed.

TTD is organising devotional cultural programs during the annual fete.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వ‌ర‌కు వాల్మీకిపురం శ్రీ ప‌ట్టాభిరామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి, 2024 మార్చి 22: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12 నుండి 20వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌వుతాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు :

తేదీ

12-04-2024

ఉదయం – ధ్వజారోహణం(వృష‌భ‌ ల‌గ్నం),

రాత్రి – గజవాహనం

13-04-2024

ఉదయం – ముత్యపుపందిరి వాహనం,

రాత్రి – హనుమంత వాహనం

14-04-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం,

రాత్రి – సింహ వాహనం

15-04-2024

ఉదయం – సర్వభూపాలవాహనం,

రాత్రి – పెద్దశేష వాహనం

16-04-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం,

రాత్రి – చంద్రప్రభవాహనం, మోహినీ అవతారం

17-04-2024

ఉదయం – తిరుచ్చి ఉత్సవం,

రాత్రి – కల్యాణోత్సవం, గరుడ వాహనం

18-04-2024

ఉదయం – రథోత్సవం,

రాత్రి – ధూళి ఉత్సవం

19-04-2024

ఉదయం – తిరుచ్చి ఉత్సవం,

రాత్రి – అశ్వవాహనం, పార్వేట ఉత్సవం

20-04-2024

ఉదయం – వసంతోత్సవం, చక్రస్నానం,

రాత్రి – హంస వాహనం, ధ్వజావరోహణం.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 17న రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.