SRI RAMANAVAMI ASTHANAM AT SRIVARI TEMPLE ON APRIL 17 _ ఏప్రిల్ 17న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

SRI RAMA PATTABHISHEKAM ON APRIL 18

Tirumala, 14 April 2024: In Tirumala Srivari Temple, a grand Asthanam will be held on  April 17 to celebrate Sri Ram Navami.  On this occasion, in the evening Sri Rama will be taken on a procession on Hanuman carrier.  

Similarly, Sri Rama Pattabhishekam will be performed on April 18 in Srivari Temple.

On the occasion of Sri Rama Navami, on Wednesday from 9 am to 11 am, Snana Tirumanjanam will be held for the Hanumantulavari Utsavarlu along with Sri Sitarama Lakshmana at Ranganayakula Mandapam.  

Hanumantha Vahana Seva will be held between 6.30 pm and 8 pm.  After that, between 9pm to 10 pm Sri Ramanavami Asthanam will be observed.  

Due to this reason, TTD has cancelled Sahasra Deepalankara Seva.

On April 18, between 8 and 9 pm, Sri Rama Pattabhisheka Mahotsava Asthanam will be observed.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 17న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

– ఏప్రిల్ 18న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల, 2024 ఏప్రిల్ 14: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల‌వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వ‌హిస్తారు.

శ్రీరామనవమి సందర్భంగా బుధ‌వారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రుగుతుంది. ఆ త‌రువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కార‌ణంగా స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

ఏప్రిల్ 18న రాత్రి 8 నుండి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.