AMBEDKAR’S IDEOLOGIES ARE AN EVERLASTING INSPIRATION – SPEAKERS _ అంబేద్కర్ సిద్ధాంతాలు నిత్య స్ఫూర్తి -టీటీడీ డిఈవో డాక్టర్ భాస్కర్‌రెడ్డి
Tirupati, 14 April 2024: The Great Architect of the Indian Constitution Dr Bhimrao Ambedkar’s ideologies continue to inspire the present and illuminate the future generations said TTD Education Officer Dr Bhaskar Reddy.
The 133rd Birth Anniversary of Baba Saheb was observed by TTD in Mahati Auditorium on Sunday.
Speaking on the occasion, the DEO said Dr BR Ambedkar was more than an individual and epitomized the spirit of Justice. He tirelessly worked towards safeguarding the interests of the people.
In his address Chief PRO Dr T Ravi said he was one of the most prominent figures in Indian History and continues his legacy even after 133 years of his birth with his immortal multi-dimensional ideologies in social reform movements, eliminating caste-based discrimination, promoting education, and advocating for the rights of downtrodden in the society besides drafting the Constitution of India, he asserted.
Many other employees, Union leaders spoke on the occasion.
DyEOs Sri Govindarajan, Sri Lakshman Naik, Sri Devendra Babu, Smt Snehalata and other employees were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అంబేద్కర్ సిద్ధాంతాలు నిత్య స్ఫూర్తి -టీటీడీ డిఈవో డాక్టర్ భాస్కర్‌రెడ్డి
తిరుపతి, 14 ఏప్రిల్ 2024 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ సిద్ధాంతాలు భావి తరాలకు వెలుగులు నింపుతాయని టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్‌రెడ్డి అన్నారు.
ఆదివారం మహతి ఆడిటోరియంలో బాబా సాహెబ్ 133వ జయంతి వేడుకలను టీటీడీ ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా డిఈవో మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయ స్ఫూర్తికి ప్రతిరూపమన్నారు. ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు.
టీటీడీ చీఫ్ పిఆర్వో డాక్టర్ టి.రవి మాట్లాడుతూ ,డాక్టర్ అంబేద్కర్ కుల వివక్షను నిర్మూలించడం, విద్యను ప్రోత్సహించడం వంటి సామాజిక సంస్కరణ ఉద్యమాలు నిర్వహించినట్లు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరణించిన తర్వాత కూడా తన లక్ష్యాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంతో పాటు సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారని వివరించారు.
ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు, యూనియన్ నాయకులు ప్రసంగించారు.
డిప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీ లక్ష్మణ్ నాయక్, శ్రీ దేవేంద్రబాబు, శ్రీమతి స్నేహలత మరియు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.