PONNAKALVA UTSAVAM _ ఏప్రిల్ 23న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

Tirupati, 22 April 2024: On April 23, Sri Ponnakalva Utsavam will be observed in Sri Govindaraja Swamy temple.

Sri Govindaraja flanked by Sridevi and Bhudevi will be taken to Ponnakalva located in Tanapalle road. Sri Krishna Swamy, Andal and Chakrattalwar will also be taken in the procession.

Later Snapanam will be performed here. From there Sri Govindaraja will reach Tiruchanoor before returning to Govindaraja Swamy temple.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 23న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

ఏప్రిల్ 23వ తేదీ శ్రీ గోవిందరాజ స్వామి పొన్నకాల్వ ఉత్సవం వైభవంగా జరుగనుంది.

తిరుపతి, 2024 ఏప్రిల్ 22: శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, చక్రత్తాళ్వార్‌తో పాటు తొమ్మిది మంది దేవేరులు ఉదయం 6 గంటలకు ఊరేగింపుగా బయలుదేరి తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి చేరుకుంటారు.

అక్కడ ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 4.30 గంటల వరకు ఊంజలసేవ, సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు.

శ్రీగోవిందరాజస్వామి వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు. బావగారైన గోవిందరాజస్వామివారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపలి నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అక్కడినుండి గోవిందరాజస్వామివారు ఊరేగింపుగా బయలుదేరి రాత్రి 8 గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.