SRIVARI SEVAKS SHOULD SERVE WITH DEDICATION – SVBC CEO SRI SHANMUKH KUMAR _ రాములవారి కల్యాణానికి విచ్చేసే భక్తులకు భక్తిశ్రద్ధలతో సేవలందించాలి : ఎస్వీబిసి సిఈవో శ్రీ షణ్ముఖకుమార్
Vontimitta, 22 April 2024: The SVBC CEO Sri Shanmukh Kumar requested that the Srivari Sevaks who came to serve the devotees for Sri Sita Rama Kalyanam should serve with dedication.
A meeting was held with the sevaks on Monday at the PAC near Kalyanavedika in Vontimitta.
TTD Chief Public Relations Officer Dr Ravi said like Garuda Seva in Tirumala, Sri Sita Rama Kalyanotsavam is unique in Vontimitta Kodanda Ramalayam. He said that thousands of devotees from different parts are expected to attend this festival which is being held as a state fest.
They should offer the best possible services at Galleries, Annaprasadam, water and buttermilk distribution etc.
Additional FA and CAO Sri Ravi Prasadu, Deputy EO Smt Prashanthi and other officials participated in this program.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
రాములవారి కల్యాణానికి విచ్చేసే భక్తులకు భక్తిశ్రద్ధలతో సేవలందించాలి : ఎస్వీబిసి సిఈవో శ్రీ షణ్ముఖకుమార్
ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 22: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం చెంత సోమవారం సాయంత్రం జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీవారి సేవకులు భక్తిశ్రద్ధలతో సేవలందించాలని ఎస్వీబిసి సిఈవో శ్రీ షణ్ముఖకుమార్ కోరారు. ఒంటిమిట్టలోని కల్యాణవేదిక వద్దగల పిఏసిలో సోమవారం ఉదయం శ్రీవారి సేవకులతో సమావేశం నిర్వహించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శ్రీ షణ్ముఖ్ కుమార్ మాట్లాడుతూ, ఒంటిమిట్ట రామాలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో కల్యాణోత్సవం విశిష్టమైందన్నారు. రాష్ట్రస్థాయి వేడుకగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి స్థానికులతో పాటు పలు ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేసే అవకాశముందని తెలిపారు.
కల్యాణ వేదిక వద్ద 72 గ్యాలరీలలోనికి భక్తులను అనుమతించడం, కూర్చోబెట్టడం, క్రమబద్ధీకరించడంతో పాటు కల్యాణం అనంతరం అందరూ స్వామి, అమ్మవారి దర్శనం చేసుకునేలా చూడాలన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, ముత్యంతో కూడిన తలంబ్రాలను భక్తులకు అందించాలని సూచించారు. భక్తులందరికీ తాగునీరు, మజ్జిగ అందించాలన్నారు. ప్రతి గ్యాలరీలో 6 మంది శ్రీవారి సేవకులు, ఒక సూపర్‌వైజర్ సేవలందించనున్నట్లు తెలిపారు.
అన్నమయ్య, కడప జిల్లాల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన శ్రీవారి సేవకులు గతంలో తిరుమల, తిరుపతిలలో పలుమార్లు సేవలందించిన అనుభవంతో భక్తులకు చక్కటి సేవలు అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ రవి ప్రసాదు, డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.