ఏప్రిల్‌ 24 నుండి మే 2వ తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఏప్రిల్‌ 24 నుండి మే 2వ తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 24 నుండి మే 2వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.  ఏప్రిల్‌ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

తేదీ ఉదయం సాయంత్రం

24-04-13(బుధవారం) ధ్వజారోహణం(మిథునలగ్నం) పెద్దశేష వాహనం
25-04-13(గురువారం) చిన్నశేష వాహనం ఆలయం మూసివేత(చంద్రగ్రహణం)
26-04-13(శుక్రవారం) హంస వాహనం/సింహ వాహనం   ముత్యపుపందిరి వాహనం
27-04-13(శనివారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
28-04-13(ఆదివారం) మోహినీ అవతారం గరుడ వాహనం
29-04-13(సోమవారం) హనుమంత వాహనం గజ వాహనం
30-04-13(మంగళవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
01-05-13(బుధవారం) రథోత్సవం ఆర్జితకల్యాణోత్సవం/అశ్వవాహనం
02-05-13(గురువారం) చక్రస్నానం ధ్వజావరోహణం
     

బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మే 1వ తేదీన సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహిస్తారు.
             
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.