KAVACHA PRATISTA HELD AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కవచ ప్రతిష్ఠ

Tirupati, 2 Jul. 20: The festival of Jyestabhisekam entered day two, at Sri Govindaraja Swamy temple on Thursday with the conduction of the Kavacha Pratista in Ekantham as per Covid-19 restrictions.

As a part of the event Shatakalasa Snapanam, Maha Shanti Homam, Snapana Tirumanjanam for utsava idols for Sri Govindarajaswamy and his consorts were performed by temple archakas.

Later in the evening grand procession of the utsava idols was also taken out inside the temple premises.

Sri Sri Sri Pedda Jeeyangar and Sri Sri Sri Chinna Jeeyangar Swamijis, Special Grade DyEO Smt Varalakshmi and other staffs participated. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కవచ ప్రతిష్ఠ

తిరుపతి, 2020 జూలై 02: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకంలో భాగంగా రెండో రోజు గురువారం కవచప్రతిష్ఠ జరిగింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ఉదయం శతకలశ స్నపనం, మహాశాంతి హోమం, స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కవచప్రతిష్ఠ చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని తిరుచ్చిపై ఆలయ విమాన ప్రాకారంలో ఊరేగిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయంగార్‌, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయంగార్‌, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఇవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీరాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ‌ మునింద్ర‌ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.