ALL OUT EFFORTS TO POPULARISE SARANGAPANI SANKEERTHANS – TTD _  సారంగ‌పాణి కీర్త‌న‌ల‌ను జ‌న‌బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు కృషి- టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి

Tirupati, 07 March 2024: TTD Chairman Sri Bhumana Karunakara Reddy said on Thursday that TTD will make full efforts to popularise the Sankeertans of Sri Sarangapani which extolled glory and divinity of Sri Venugopal Swamy, an incarnation of Sri Maha Vishnu.

Launching the Sarangapani Project along with renowned veteran playback singer, Padma Vibhushan awardee Dr P Sushila at the SVETA Bhavan, also released a CD on Matrusri Tarigonda Vengamamba Dvipada on Sri Bhagavatam.

Speaking on the occasion the TTD Chairman said the 17th-century poet and Carnatic sangeet exponent Sri Sarangapani had penned over 5000 devotional songs in Telugu and Sanskrit. The project aimed at choreograph and voice these sankeertans.

Among others he said the last TTD board meeting had resolved, to conduct daily sankeertans at Galigopuram, Mokalimettu and 7th mile junctions. Nitya Sankeertans at Vengamamba Brindavana, and training to all TTD temple staff from all over the country at SVETA.

Thereafter Dr P Susheela performed some sankeertan in her melodious voice and enthralled music lovers in Tirupati.

Sri Bhumana Subramanyam Reddy SVETA Director hailed the role Sri Sarangapani in penning sankeertan which saw light after 300 years and TTD commitment to popularise them.

SVBC Chairman Sri Saikrishna Yachendra and several music and literary figures were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సారంగ‌పాణి కీర్త‌న‌ల‌ను జ‌న‌బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు కృషి

– టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి

తిరుప‌తి, 2024, మార్చి 07: శ్రీ మ‌హావిష్ణువు అవ‌తార‌మైన శ్రీ వేణుగోపాలస్వామివారిపై ప్ర‌ముఖ వాగ్గేయ‌కారుడు శ్రీ సారంగ‌పాణి అద్భుత‌మైన కీర్త‌న‌లు ర‌చించి, స్వ‌ర‌ప‌రిచార‌ని, మ‌రుగున‌ప‌డిన వాటిని జ‌న‌బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామ‌ని టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి తెలియ‌జేశారు. తిరుప‌తి శ్వేత భ‌వ‌నంలో గురువారం సాయంత్రం ప్ర‌ముఖ సినీ సంగీత క‌ళాకారిణి, ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు గ్ర‌హీత డా. పి.సుశీలతో క‌లిసి ఛైర్మ‌న్ నూత‌న సారంగ‌పాణి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర స్వ‌ర‌ప‌రిచిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ ద్విప‌ద శ్రీ‌భాగ‌వ‌తం సిడిని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా కార్వేటినగరం ప్రాంతంలో నివసించిన 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవి, కర్ణాటక సంగీత స్వరకర్త శ్రీ సారంగపాణి పేరిట నూత‌న ప్రాజెక్టును ప్రారంభించ‌డం శుభ‌ప‌రిణామం అన్నారు. శ్రీ వేణుగోపాల స్వామివారిని కీర్తిస్తూ శ్రీ సారంగపాణి తెలుగు, సంస్కృత భాషల్లో సుమారు 5 వేల కీర్తనలు రచించారని, ప్ర‌స్తుతం 500 కీర్త‌న‌లు మాత్ర‌మే ల‌భ్య‌మ‌వుతున్నాయ‌ని తెలిపారు. అందుబాటులో ఉన్న కీర్త‌న‌ల‌ను స్వ‌ర‌ప‌ర‌చ‌డంతోపాటు నూత‌న కీర్త‌న‌ల‌ను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంద‌న్నారు. గాలిగోపురం, మోకాలిమెట్టు, ఏడో మైలు ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హం వ‌ద్ద నిత్య సంకీర్త‌నార్చ‌న చేసేందుకు గ‌త బోర్డు స‌మావేశంలో నిర్ణ‌యించామ‌న్నారు. తిరుమ‌ల‌లో వెంగ‌మాంబ బృందావనం ఆధునీక‌ర‌ణ ప‌నులు పూర్తికాగానే అక్క‌డ కూడా నిత్య సంకీర్త‌నార్చ‌న నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆల‌యాల సిబ్బందికి శిక్ష‌ణ ఇచ్చేలా శ్వేతను అభివృద్ధి చేస్తామ‌న్నారు.

ప్ర‌ముఖ సినీ సంగీత క‌ళాకారిణి, ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు గ్ర‌హీత డా. పి.సుశీల మాట్లాడుతూ సారంగ‌పాణి కీర్త‌న‌లు అమోఘ‌మైన‌వ‌ని, వారి పేరిట ఏర్పాటుచేసిన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వంలో పాల్గొన‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని చెప్పారు. అనంత‌రం ప‌లు మ‌ధుర‌గీతాల‌ను వారి విన‌సొంపైన స్వ‌రంతో ఆల‌పించి స‌భ‌ను ఆనంద‌డోలిక‌ల్లో ముంచెత్తారు.

శ్వేత, త‌రిగొండ వెంగ‌మాంబ ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ భూమ‌న సుబ్ర‌మ‌ణ్యంరెడ్డి మాట్లాడుతూ మీరాబాయి త‌ర‌హాలో భ‌క్తి సాహిత్యంలో సారంగ‌పాణి కీర్త‌న‌ల‌కు ఎంతో ప్ర‌త్యేకత ఉంద‌న్నారు. 300 ఏళ్ల త‌రువాత కొంత మంది క‌ళాకారులు సారంగ‌పాణి కీర్త‌న‌లను వెలుగులోకి తెచ్చార‌ని, ఇంకా చాలా కీర్త‌న‌లు అందుబాటులోకి రావాల్సి ఉంద‌ని అన్నారు. ఈ కీర్త‌న‌ల‌ను వెలుగులోకి తెచ్చేందుకు వెంగ‌మాంబ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో నూత‌నంగా సారంగ‌పాణి ప్రాజెక్టుకు టీటీడీ శ్రీ‌కారం చుట్టింద‌ని తెలిపారు. సారంగ‌పాణి కీర్త‌న‌ల‌తో రెండు సిడీల‌ను, వెంగ‌మాంబ ర‌చ‌న‌ల నుండి ఎంపిక చేసిన గీతాల‌తో మ‌రో రెండు సీడీల‌ను త్వ‌ర‌లో రూపొందిస్తామ‌ని వెల్ల‌డించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర, ప‌లువురు సంగీత‌, సాహితీప్రియులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.