SRI DAKSHINARMURTHY HOMAM HELD  _ కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం 

Tirupati, 18 January 2023: As part of ongoing Homams in Kapileswara Swamy temple in Tirupati Sri Dakshinamurthy Homam was performed on Thursday.

 

Temple DyEO Sri Devendra Babu, AEO Sri Parthasarathy, Temple Archakas and officials were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం 
 
తిరుపతి, 2023 జనవరి 19: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. 
 
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ట, దక్షిణామూర్తి స్వామివారి హోమం, పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. 
 
జనవరి 20న శ్రీ దుర్గా, లక్ష్మీ, సరస్వతి హోమం, చివరిరోజైన జనవరి 21న శ్రీ రుద్ర, మహామృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ పార్థసారథి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.