MORE FACILITIES FOR PATIENTS IN BIRRD HOSPITAL _ బర్డ్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సౌకర్యాలు, వైద్య సేవలు

TIRUPATI, 19 JANUARY 2023: The patients who are getting admitted in BIRRD hospital for treatment with faith over the benign blessings of Sri Venkateswara Swamy, shall be given enhanced accommodation and medical facilities, said TTD JEO for Health and Education Smt Sada Bhargavi.

 

The JEO on Thursday inspected the BIRRD hospital to observe the amenities and medical facilities being provided to the patients. She instructed the forest officials to improve gardening in the Hospital premises to give a pleasant look. 

 

She also directed the Vigilance officials to streamline the parking facility in front of the Hospital. She also verified the Emergency, X-Ray, Scanning, OP wards and interacted with the patients and received their feedback over the quality of Annaprasadam being served to them.

 

The JEO later asked the Hospital authorities to set up a Cafeteria in new block and a canteen in old block for the sake of the attendants of patients. She directed them to computerize every data pertaining to a patient on the date of his or her joining till discharge.  

 

OSD Dr Reddeppa Reddy, Additional HO Dr Sunil Kumar, CSRMO Dr Kishore, EE Sri Krishna Reddy, DE Smt Saraswathi and others were present.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బర్డ్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సౌకర్యాలు, వైద్య సేవలు

– అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు జేఈవో శ్రీమతి సదా భార్గవి ఆదేశం

తిరుపతి 19 జనవరి 2023: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద విశ్వాసంతో బర్డ్ ఆసుపత్రికి వచ్చే రోగులకు మరింత మెరుగైన వసతులు, వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు.

బర్డ్ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అందుతున్న సదుపాయాలు, వైద్య సేవలు, శస్త్ర చికిత్సలను గురువారం ఆమె పరిశీలించారు. ఆసుపత్రి ముందు, వెనుక ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ఎదురుగా వాహనాల పార్కింగ్ క్రమ పద్ధతిలో ఉండేలా ఏర్పాటు చేయాలని విజిలెన్స్ అధికారులకు చెప్పారు. అత్యవసర వార్డు, జనరల్ వార్డు, ఎక్స్ రే, స్కానింగ్, ఓపి వార్డులను ఆమె పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, అన్న ప్రసాదాల నాణ్యత గురించి రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి కొత్త బ్లాక్ లో కేఫ్తెరియా, పాత బ్లాక్ వద్ద ఖాళీ స్థలంలో రోగులు వారి సహాయకుల కోసం క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జేఈవో సూచించారు. ఆసుపత్రి లోని కారిడార్లు, వార్డుల ఆవరణం అందంగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న సామగ్రి డిపిడబ్ల్యు స్టోర్ కు తరలించాలని ఆదేశించారు.

కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆమె సూచించారు.

రోగి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు వారికి చేసిన వివిధ రకాలపరీక్షలు, అందించిన వైద్యం లాంటి మొత్తం వివరాలు కంప్యూటరైజ్ చేయాలని ఆమె ఆదేశించారు.

ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్ప రెడ్డి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, సి ఎస్ ఆర్ ఎంవో డాక్టర్ కిషోర్, ఈ ఈ శ్రీ కృష్ణారెడ్డి, డి ఈ శ్రీమతి సరస్వతి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల ఆధికారిచే జారీ చేయడమైనది