STUDENT MAKES BEST OUT OF WASTE _ కాగితాల‌తో అద్భుత‌మైన శ్రీ‌వారి క‌ళారూపం

JEO (H & E) LAUDS THE TALENTED PUPIL

 Tirupati, 25 Feb. 22: The Joint Executive Officer of TTD for Health and Education Smt Sada Bhargavi appreciated the artistic talent of a Junior College student for his extra curricular skill of making the best out of waste.

Going into details, M Omkar, son of Sri M Madhusudhan from Kadiri of Anantapur district, who is in his second year BiPC in SV Junior College has passion towards drawing since his childhood.

After his college hours, he used to make crafts out of old newspapers and mastered in this art on his own. He recently completed making the replica of Sri Venkateswara Swamy with waste papers and given it a beautiful shape with colours after working on it for a couple of months. He is now working on Sri Padmavathi Devi.

The boy met the JEO in her chamber in TTD administrative building in Tirupati on Friday. While giving him a pat on the back she said, students with such extra curricular skills need to be encouraged in all TTD educational institutions.

She also directed the concerned that such pupils should be identified so that their crafts shall be displayed in the expo gallery during the ensuing brahmotsavams at Tirumala this year.

Devasthanam Education Officer (DEO) Sri C Govindarajan, Principal of SV Junior College Sri Gangadhar Rao were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కాగితాల‌తో అద్భుత‌మైన శ్రీ‌వారి క‌ళారూపం

టీటీడీ ఎస్వీ జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్థి ప్ర‌తిభ

అభినందించిన జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 25: టిటిడికి చెందిన ఎస్వీ జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్థి ఎం.ఓంకార్ కాగితాల‌తో అద్భుత‌మైన‌ శ్రీ‌వారి క‌ళారూపాన్ని సృష్టించాడు. చ‌దువుతోపాటు క‌ళ‌ల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న ఈ విద్యార్థిని శుక్ర‌వారం టిటిడి పరిపాలన భవనంలోని కార్యాలయంలో జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి అభినందించారు.

అనంత‌పురం జిల్లా క‌దిరికి చెందిన శ్రీ ఎం.మ‌ధుసూద‌న్ కుమారుడు ఎం.ఓంకార్ ఎస్వీ జూనియ‌ర్ క‌ళాశాలలో ఇంట‌ర్ బైపిసి రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. చిన్న‌ప్ప‌టి నుండి చిత్ర‌లేఖ‌నం అల‌వాటుగా మార్చుకున్నాడు. దీంతోపాటు క‌ళాశాల స‌మ‌యం అయిపోయిన త‌రువాత మిగిలిన స‌మ‌యంలో కాగితాల‌తో దేవ‌తామూర్తుల బొమ్మ‌ల త‌యారీని సాధ‌న చేశాడు. ఈ విధంగా 2 నెల‌ల స‌మ‌యంలో మూడు అడుగుల ఎత్తు గ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ప్ర‌తిమ‌ను త‌యారుచేశాడు. మొద‌ట కాగితాల‌ను ఉప‌యోగించి శ్రీ‌వారి ఆకృతిని త‌యారు చేశాడు. ఆ త‌రువాత వాటికి రంగులు అద్ది పూర్తి రూపాన్ని ఆవిష్క‌రించాడు. ప్ర‌స్తుతం ఇదే త‌ర‌హాలో శ్రీ‌ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ప్ర‌తిమ‌ను తయారు చేస్తున్నాడు.

కాగితాల‌తో దేవ‌తామూర్తుల ప్ర‌తిమ‌ల‌ను సృష్టిస్తున్న విద్యార్థి ఓంకార్ క‌ళాత్మ‌క‌త అద్భుత‌మ‌ని జెఈవో కొనియాడారు. టిటిడి విద్యాసంస్థ‌ల్లో చిత్ర‌లేఖ‌నంలో ఇలాంటి ప్ర‌తిభ గ‌ల విద్యార్థుల‌ను గుర్తించి దేవ‌తామూర్తుల చిత్రాలు రూపొందించాల‌ని, ఇలాంటి చిత్రాల‌తో రాబోయే శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌త్యేక గ్యాల‌రీని ఏర్పాటుచేసి భ‌క్తుల‌కు ప్ర‌ద‌ర్శించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని డిఈవోను ఆదేశించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి విద్యాశాఖాధికారి శ్రీ గోవింద‌రాజ‌న్‌, ఎస్వీ జూనియ‌ర్ క‌ళాశాల ప్రిన్సిపాల్ శ్రీ గంగాధర్ రావు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.