SALE CUM EXIBITION OF STATUES FROM FEBRUARY 26-MARCH 3 _ ఫిబ్ర‌వ‌రి 26 నుండి మార్చి 3వ తేదీ వ‌ర‌కు శిల్పాల ప్ర‌ద‌ర్శ‌న, అమ్మ‌కం

Tirupati, 25 February 2022:The TTD run Sri Venkateswara Traditional temple construction and sculpture training Institute is organising an exhibition cum sale of sculptures from February 26-March 3.

The six-day exhibition cum sale will commence on Saturday morning at 11.00am in the sculpture college near Balaji link bus stand on Alipiri road

All the sculptures carved by students like temple Gopuras, idols, Suddha and Daru idols Pancha Loha idols, conventional colour paintings, kalamkari Color paintings will be exhibited and also offered for purchase.

The exhibition will be open every day at 10.00 am till 6.00 pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 26 నుండి మార్చి 3వ తేదీ వ‌ర‌కు శిల్పాల ప్ర‌ద‌ర్శ‌న, అమ్మ‌కం

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 25: టిటిడి ఆధ్వ‌ర్యంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర సంప్ర‌దాయ ఆల‌య నిర్మాణ శిల్ప‌శిక్ష‌ణ సంస్థ‌లో ఫిబ్ర‌వ‌రి 26 నుండి మార్చి 3వ తేదీ వ‌ర‌కు ఆరు రోజుల పాటు శిల్పాల ప్ర‌ద‌ర్శ‌న, అమ్మ‌కం జ‌రుగ‌నుంది. తిరుప‌తి అలిపిరి రోడ్డులోని బాలాజి లింక్ బ‌స్టాండ్ ప‌క్క‌న‌గల శిల్ప క‌ళాశాల‌లో శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ ప్ర‌ద‌ర్శ‌న ప్రారంభోత్స‌వం జ‌రుగ‌నుంది.

శిల్ప‌క‌ళాశాల విద్యార్థులు రూపొందించిన దేవాల‌య విమానాలు, మండ‌పాలు, గోపురాలు, శిలాశిల్పాలు, సుధాశిల్పాలు, దారుశిల్పాలు, పంచ‌లోహ శిల్పాలు, సంప్ర‌దాయ వ‌ర్ణ‌చిత్రాలు, సంప్ర‌దాయ క‌లంకారి వ‌ర్ణ‌చిత్రాలను ప్ర‌ద‌ర్శించ‌డంతోపాటు విక్ర‌యిస్తారు. ప్ర‌తిరోజూ ఉద‌యం 10 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఈ ప్ర‌దర్శ‌న ఉంటుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.