రాజమండ్రి జనవరి 15న వేద విద్వుత్‌ సదస్సు

రాజమండ్రి జనవరి 15న వేద విద్వుత్‌ సదస్సు

తిరుమల, 13 జనవరి 2013: హైందవ సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తి.తి.దే ఆధ్వర్యంలో సంప్రదాయ రాజధానిగా వెలుగొందుతున్న రాజమండ్రిలో జనవరి 15న ”శ్రీ శ్రీనివాస వేదవిద్వత్‌” సదస్సును ఘనంగా నిర్వహించనుంది.
 
శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ఈ ధార్మికోపన్యాస కార్యక్రమం జరుగనుంది. ”షఠ్‌ శాస్త్రాల” పై జరుగనున్న ఈ సదస్సులో రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జరుగనుంది. ఉదయం 8.00 గం||ల నుండి మధ్యాహ్నం 1.00 గం||ల వరకు జరిగే ఈ సదస్సులో ఎందరో ప్రముఖులు, వేదపండితులు పాల్గొననున్నారు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుగారి ఉపన్యాసం మ. 3 గం||లకు, అదే విధంగా కుర్త్రాళం పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థస్వామివారి అనుగ్రహ భాషణం సా. 6 గం||లకు జరుగనుంది. అనంతరం 18 మంది తలపండిన వేద ఘనాపాఠీలను ఈ సందర్భంగా సన్మానించనున్నారు.
 
పవిత్ర గోదావరీ నదీ తీరాన జరిగే ఈ ఉత్కృష్ట వేద సదస్సులో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని హైంధవ సనాతన ధర్మానికి మూలమైన వేదవిద్యుత్తులోని నిగూఢ రహస్యాలను, ఆంతర్యాన్ని తెలుసుకొని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృతకృత్యులు కావాలని తి.తి.దే విజ్ఞప్తి చేస్తున్నది.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.