PADMAVATHI PARIYANOTSAVAM CONCLUDES _ ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు 

TIRUMALA, 01 May 2023:  the three day annual celestial wedding ceremony of Sri Padmavathi Pariyanotsavam concluded in Tirumala on Monday evening.

 

Earlier the processional deities of Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi entered the finely decked Parinayotsava Mandapam on Garuda Vahanam and Tiruchis separately.

 

After observing Edurkolu, Varana Mayiram, Poobantata and other Hindu marriage traditions, the deities were seated on the tastefully decorated swing in Parinayotsava Mandapam located in Narayanagiri Gardens.

 

The devotees were mesmerized to see the divine wedding ceremony on the pleasant evening. 

 

Deputy EO Sri Lokanatham, Garden Deputy Director Sri Srinivasulu and other officials, huge number of devotees were present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

తిరుమల, 2023 మే 01: శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం సోమవారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.

ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర క‌ల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగ‌ళ‌క‌రంగా సంగీత‌, మేళ‌, తాళ వాయిద్యాలను ప్ర‌ద‌ర్శించారు.

ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ర‌స‌ర‌మ్యంగా అన్నమాచార్య కీర్తనలు ఆల‌పించారు. హార‌తి అనంత‌రం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి.

ఈ కార్యకమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇత‌ర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.