SAMUHIKA SHRAMADANAM PROGRAM ON MAY 13- TTD EO _ మే 13న సామూహిక శ్రమదాన కార్యక్రమం – టీటీడీ ఈఓ

EXTENDS THANKS TO ALL FOR MAKING SUNDARA TIRUMALA-SUDDHA TIRUMALA  HUGE SUCCESS

THE EVENT IS A NATIONWIDE HIT TODAY- EO

Tirumala, 01 May 2023: After the stupendous success of the Sundara Tirumala-Suddha Tirumala mass cleaning programme by TTD employees in Tirumala, Samuhika Shramadanam is fixed on May 13 to make Tirumala a plastic-free environment with employees, said TTD EO Sri AV Dharma Reddy.

During a meeting held with all HoDs of TTD, Principals, Medical Superintendents along with District Collector Sri Venkatramana Reddy and SP Sri Parameshwar Reddy at Seva Sadan 2 in Tirumala on Monday evening, the EO thanked all the employees for their team spirit in executing cleaning and sanitation works in the last two days.

With the same spirit, the EO called upon the HoDs and employees to gear up to make both ghat roads and footpath routes of Tirumala plastic free. ”Let us all participate in a four-hour long Samuhika Shramadanam to clear the plastic waste. On both Ghats nearly 500 and footpath routes nearly 1000 employees will render services on that day”, he maintained.

He also said a lot of sulabh workers have joined back their duties on Monday and almost everyone will return in next couple of days. “But this Shramadana Yagna will continue every month as it has received overwhelming support across the country and TTD has become a role model. So we should take forward the Swachch slogan pioneered by Mahatma Gandhi by cleaning premises in Tirumala on our own once in a month”, he reiterated.

The Suddha Tirumala movement has instilled inspiration among devotees also who are approaching TTD to provide them a chance to clean the precincts, he maintained.

Later all the district top brass officials spoke on the occasion besides media representatives who also participated in the Suddha Tirumala voluntarily.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, Joint Collector Sri Balaji, TMC Commissioner Smt Harita, all HoDs of TTD, Principals, Medical Superintendents were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 13న సామూహిక శ్రమదాన కార్యక్రమం – టీటీడీ ఈఓ

– సుందర తిరుమల-శుద్ధ తిరుమలను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు

– ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఆదర్శమయ్యింది

తిరుమల, 2023 మే 01: తిరుమలలో టీటీడీ ఉద్యోగులు చేపట్టిన సుందర తిరుమల-శుద్ధ తిరుమల సామూహిక పరిశుభ్రత కార్యక్రమం అద్భుతంగా విజయవంతం కావడంతో తిరుమలను ప్లాస్టిక్ రహిత వాతావరణంగా తీర్చిదిద్దేందుకు మే 13న సామూహిక శ్రమదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి తెలిపారు.

సోమవారం సాయంత్రం తిరుమలలోని సేవాసదన్ 2లో జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రమణారెడ్డి, ఎస్పీ శ్రీ పరమేశ్వర్‌రెడ్డితో పాటు టీటీడీలోని అన్ని విభాగాధిపతులు, ప్రిన్సిపాళ్లు, మెడికల్ సూపరింటెండెంట్‌లతో ఈఓ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పారిశుద్ధ్య నిర్వాహణలో స్ఫూర్తిదాయకంగా పనిచేసిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు. గత రెండు రోజులుగా పారిశుధ్య పనులు జరుగుతున్నాయన్నారు.

ఇదే స్ఫూర్తితో తిరుమలలోని ఘాట్‌రోడ్లు, నడక మార్గాలను ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు విభాగాధిపతులు, ఉద్యోగులు సన్నద్ధం కావాలని ఈఓ పిలుపునిచ్చారు. ”ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు మనమందరం నాలుగు గంటల పాటు సాగే సామూహిక శ్రమదానంలో పాల్గొనాలన్నారు. రెండు ఘాట్‌లలో దాదాపు 500, ఫుట్‌పాత్ రూట్లలో దాదాపు 1000 మంది ఉద్యోగులు ఆ రోజు సేవలు అందిస్తారు” అని ఆయన పేర్కొన్నారు.

చాలా మంది సులభ్ కార్మికులు సోమవారం తమ విధుల్లో చేరారని, మరో రెండు రోజుల్లో దాదాపు అందరూ తిరిగి వస్తారని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ శ్రమదాన యజ్ఞానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభించడంతో పాటు టీటీడీ ఆదర్శంగా మారడంతో ప్రతినెలా కొనసాగుతుందన్నారు. కాబట్టి తిరుమలలో నెలకొకసారి మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేస్తూ మహాత్మాగాంధీ అందించిన స్వచ్ఛ్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి ” అని ఈవో పునరుద్ఘాటించాడు.

తిరుమల పరిసరాలను శుభ్రపరిచే అవకాశం తమకు కల్పించాలని టీటీడీని అడుగుతున్న భక్తుల్లో కూడా శుద్ధ తిరుమల ఉద్యమం స్ఫూర్తిని నింపిందని ఆయన అన్నారు.

అనంతరం శుద్ద తిరుమలలో స్వచ్ఛందంగా పాల్గొన్న మీడియా ప్రతినిధులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు అందరూ ఈ సందర్భంగా మాట్లాడారు.

జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ ఓ శ్రీ నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ శ్రీ బాలాజీ, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి హరిత, టీటీడీలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులు, ప్రధానోపాధ్యాయులు, మెడికల్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.