ఘ‌నంగా శ్రీ కపిలేశ్వరస్వామి ఉన్నత పాఠశాల ప్రథమ వార్షికోత్సవం

ఘ‌నంగా శ్రీ కపిలేశ్వరస్వామి ఉన్నత పాఠశాల ప్రథమ వార్షికోత్సవం

తిరుపతి, 2010 ఏప్రిల్‌ 23: తిరుపతిరూరల్‌ తాటితోపులోని తిరుమల తిరుపతి దేవస్థానముల వారి శ్రీ కపిలేశ్వరస్వామి ఉన్నత పాఠశాల ప్రథమ వార్షికోత్సవము ఏప్రిల్‌ 23, ఉదయం 9.00 గంటలకు కన్నులపండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు, గురువులకు, గ్రామానికి మంచిపేరు తీసుకొనిరావాలని సూచించాడు. నేటి విద్యావిధానములో బాలికలు అన్నిరంగాలలో రాణించడం శుభ పరిణామమని అన్నారు. బాల బాలికలు ఉన్నతి విద్యను అభ్యసించి మనదేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.                

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన తితిదే విద్యాశాఖాధికారి డాక్టర్‌ కె.నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని దేశ ప్రతిష్ఠతను ఇనుమడింపచేయాలని సూచించారు. చదువు యొక్క విలువలను విద్యార్థులకు వివరించారు.

అనంతరం ఆటల పోటీలలో గెలిచిన వారికి బహుమతులు అందించి అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.కిషన్‌ పాఠశాల వార్షిక వేధికను చదివి వినిపించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల వార్షికోత్సవం వేడుకలు ముగిసాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.