LORD CHILLS ON CHANDRAPRABHA VAHANAM _ చంద్రప్రభ వాహ‌నంపై నర్తనకృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి 

TIRUPATI, 17 FEBRUARY 2023: Sri Kalyana Venkateswara as Naratana Krishna chilled on Chandraprabha Vahanam on the seventh day evening on Friday.

The devotees had a soothing experience on witnessing the lord on a pleasant Moon carrier. 

The devotees danced with utmost devotion in front of Vahanam to the rhythmic beats of Kerala Dolu.

Special Grade DyEO Smt Varalakshmi, Kankanabhattar Sri Balaji Rangacharyulu, AEO Sri Gurumurty, Superintendents Sri Chengalrayalu, Sri Venkata Swamy, temple inspector Sri Kiran and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చంద్రప్రభ వాహ‌నంపై నర్తనకృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

తిరుపతి, 2023 ఫిబ్రవరి 17: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన శుక్రవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు చంద్రప్రభ వాహ‌నంపై నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు.

చంద్ర‌ప్రభ వాహనం – సకలతాపహరం

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ వెంకటస్వామి, కంకణ బట్టార్ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.