ALL SET FOR CHAKRASNANAM _ చ‌క్ర‌స్నానానికి ఏర్పాట్లు పూర్తి

POWER OF HOLY BATH LASTS THE ENTIRE DAY

–  JEO TPT

Tirumala, 22 October 2023: TTD JEO Sri Veerabrahmam said on Sunday that all preparations are made towards the smooth conduction of prestigious Chakra  Snanam in the Swami Pushkarini on Monday, on the last day of Srivari Navaratri Brahmotsavsm. 

Addressing a review meeting at the Brahmotsavsm Cell on Sunday he said the sanctity of Chakra  Snanam prevailed throughout the day and devotees should take advantage. 

He said Chakra Snanam will be performed to Sri Chakratthalwar and Sri Malayappa Swami with consorts between 6 am to 9 am after Snapana Tirumanjanam.

He said all arrangements are being made for the holy dip for devotees and appealed to them that the power of sacred waters last the entire day and devotees shall take bath with patience.

Earlier he inspected the arrangements at Pushkarini entry and exit gates and the dress changing rooms and made valuable suggestions to the engineering officials. 

SVBC CEO Sri Shanmukh Kumar, SE-2: Sri Jagadeeshwar Reddy, VGO Sri Bali Reddy and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

చ‌క్ర‌స్నానానికి ఏర్పాట్లు పూర్తి

– పుష్క‌రిణిలో రోజంతా ప‌విత్ర‌త

– జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం

తిరుమల, 2023 అక్టోబ‌రు 22: శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో చివ‌రి రోజైన అక్టోబ‌రు 23న చ‌క్ర‌స్నానానికి ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని టీటీడీ జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం తెలిపారు. ఆదివారం బ్ర‌హ్మోత్సవం సెల్‌లో జేఈవో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా జేఈవో మాట్లాడుతూ, ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద గ‌ల స్వామి పుష్క‌రిణిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, శ్రీ చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, ఆ త‌రువాత చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తార‌న్నారు. ఇందుకోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కరిణిలో గ్యాలరీలు, స్నానఘట్టాలు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

భ‌ద్ర‌తాప‌రంగా ఇబ్బందులు లేకుండా టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బందితో పాటు ఎన్‌డిఆర్ఎఫ్‌, ఎస్‌డిఆర్ఎఫ్‌ సిబ్బంది, ఈత‌గాళ్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. చక్రస్నానం ప‌విత్ర‌త రోజంతా ఉంటుంద‌ని, భ‌క్తులు సంయమనం పాటించి పుష్కరిణిలో స్నానం చేయాల‌న్నారు.

పుష్క‌రిణి వ‌ద్ద ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జేఈవో

అంత‌కుముందు శ్రీ‌వారి పుష్క‌రిణి వ‌ద్ద చ‌క్ర‌స్నానం ఏర్పాట్ల‌ను అధికారుల‌తో క‌లిసి జేఈవో ప‌రిశీలించి, ప‌లు సూచ‌న‌లు చేశారు. పుష్క‌రిణిలోనికి ప్ర‌వేశ‌, నిష్క్ర‌మ‌ణ గేట్ల‌ను ప‌రిశీలించారు. భ‌క్తులు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు.

ఈ స‌మావేశంలో ఎస్వీబీసీ సిఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.