RAMA RIDES CHINNA SESHA VAHANA _ చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం

Tirupati, 14 Mar. 21: Sri Kodanda Rama Swamy took a celestial ride on Chinna Sesha Vahanam on Sunday. 

In view of covid guidelines brahmotsavams are taking place in Ekantam.

CE Sri Ramesh Reddy, Temple spl gr DyEO Smt Parvati, AEO Sri Durgaraju, Superintendent Sri Ramesh Kumar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చిన్నశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం

తిరుపతి, 2021 మార్చి 14: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీశక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీశక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం.

వాహన సేవ అనంతరం ఉదయం 11.00 గంటల నుండి 12.00 గంటల వరకు కల్యాణ మండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించనున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం నిర్వహిస్తారు.

సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ జరగనుంది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు హంస వాహనంపై శ్రీకోదండరామస్వామివారు కనువిందు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.