967TH AVATAROTSAVAM OF ANANTALWAR OBSERVED _ తిరుమలలో ఘనంగా పురశైవారితోటోత్సవం
Tirumala, 14 Mar. 21: As a tribute on the 967th Avatarotsavam of Sri Vaishnava Acharya Sri Anantalwar, Purusaivari Thototsavam was been observed in Tirumala on Sunday.
In his spiritual address, the Tirumala Pedda Jiyangar HH Sri Periyakoil Kelviappan Shatagopa Ramanuja Periya Jiyar Swamy said Ananthalwar stood as the right example for a true ”Bhakta” (devotee) who dedicated his life in the service of Lord Venkateswara. He said he pioneered the Pushpa Kainkaryam in the temple of Lord Venkateswara and rendered his sincere services till his last breath in his 102 years of a pious life.
Sri Narayana Chinna Jiyar Swamy in his anugraha bhashanam said, Anantalwar took forward the legacy of Sri Ramanujacharya and stood as a role model to many Sri Vaishnavaites.
Later both Sri Pedda Jiyar and Sri Chinna Jiyar Swamijis released a book on
Anantalwar Divya Charitra in different languages penned by Sri P Venkatrami Reddy.
Meanwhile the Avatarotsavam was observed with great religious fervour under the aegis of the Alwar Divya Prabandha Project headed by HDPP Secretary Sri Rajagopalan in the Alwar tank gardens.
Later, the entire clan of Sri Ananthalwar hailing from across the country took part in the Shodasa Upanyasamala programme.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమలలో ఘనంగా పురశైవారితోటోత్సవం
తిరుమల, 2021 మార్చి 14: శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతళ్వారు 967వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాళ్వార్‌తోటలో (పురశైవారితోట) ఆదివారంనాడు టిటిడి ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా సుమారు 300 లకు పైగా అనంతళ్వారు వంశీకులు ”నాలాయిర దివ్యప్రబంధ గోష్ఠిగానం” నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి అనుగ్రహబాషణం చేస్తూ, 102 ఏళ్ళ సుదీర్ఘ జీవన ప్రస్థానంలో స్వామివారికి పుష్పకైంకర్యాన్ని ప్రారంభించి ఉద్దరించిన శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ అనంతాళ్వార్‌ని కొనియాడారు. అనంతాళ్వారు వంశీకులు కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావహం అన్నారు.
తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి మాట్లాడుతూ, 967 సంవత్సరాల క్రితం
శ్రీ రామానుజాచార్యులవారు స్వామి కైంకర్యాన్ని క్రమబద్దీకరించడానికి తన శిష్యబృదంలో ఎవరైన ఉన్నారా అని అడిగినప్పుడు అనంతళ్వారు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఆయన తిరుమలలో వివిధ రకాల సుగంధభరిత పుష్పాల మొక్కలతో తోటను ఏర్పరచి స్వామివారి పుష్ప కైంకర్యాన్ని ప్రారంభించి తన జీవితాన్ని భగవంతుని సేవకు సమర్పించుకున్నారని వివరించారు.
తరువాత శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామివారు కలిసి విజయవాడకు చెందిన శ్రీ పి.వి.రామిరెడ్డి రచించిన అనంతాళ్వార్ దివ్య చరితం పుస్తకం రెండవ ముద్రణను అవిష్కరించారు. అదేవిధంగా తమిళం, హిందీ, మరాఠి బాషాల్లోని శ్రీమన్ అనంతాళ్వార్ దివ్య చరితం గ్రంథాలను జీయర్ స్వాములు అవిష్కరించారు.
ఈ సందర్భంగా 16 శ్రీవైష్ణవ దివ్య దేశాలనుండి వచ్చిన శ్రీ వైష్ణవ పండితులు ఆళ్వార్ దివ్య ప్రబంధ పఠనం చేశారు..
ఈ కార్యక్రమంలో టిటిడి హెచ్‌డిపిపి కార్యదర్శి మరియు ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య రాజగోపాలన్, అనంతాళ్వార్ వంశీకులు శ్రీ తాతాచార్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.