BOY’S HEALTH IS STABLE- DOCTORS _ చిరుత దాడిలో గాయపడి కోలుకుంటున్న చిన్నారి కౌశిక్

Tirupati,24 June 2023: The Director of Sri Padmavathi Children’s Hospital Dr Srinath in a press statement released on Saturday evening stated that the health condition of the three-year-old Kaushik is stable.

Kaushik who hailed from Adoni of Kurnool district was injured in a leopard attack at Alipiri footpath on the night of June 22nd and was admitted in the hospital immediately in an ambulance under the instructions of TTD EO Sri AV Dharma Reddy.

Three teams of experts are monitoring on 24×7 basis about the health condition of the boy who is progressing well.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చిరుత దాడిలో గాయపడి కోలుకుంటున్న చిన్నారి కౌశిక్
 
తిరుపతి, 24 జూన్ 2023: తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడిలో గాయపడిన చిన్నారి కౌశిక్(3) క్రమంగా కోలుకుంటున్నాడని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
జూన్ 22న రాత్రి తిరుమల కాలినడక మార్గంలో చిన్నారి కౌశిక్ పై చిరుత దాడి జరిగిన వెంటనే స్పందించిన టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి స్వయంగా ప్రత్యేక అంబులెన్సులో తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్న పిల్లల వైద్య నిపుణులు మూడు బృందాలుగా ప్రత్యేక పర్యవేక్షణలో 24 గంటల పాటు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. వైద్యుల చికిత్సకు స్పందిస్తూ చిన్నారి క్రమక్రమంగా కోలుకుంటున్నాడని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.