JEO REVIEW ON TTD TEMPLES _ టీటీడీ ఆలయాల వద్ద పక్కాగా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలి : జెఈవో శ్రీ వీరబ్రహ్మం

Tirupati, 24 June 2023: TTD JEO  Sri Veerabrahmam on Saturday directed officials concerned to install sign boards at all location of TTD sub temples with relevant information for the benefit of the pilgrims coming from different parts of the country.

Addressing a virtual review meeting with officials of TTD  temples in Tirupati and other areas, the JEO said all-out effort be made to increase the number of footfalls, UPI payments for sevas and services, complete pending engineering works, distribution of Annaprasadam involving donors, donation register, CCTV security, hygiene garbage Clearance and provision of accommodation etc.

DyEOs Sri Govindarajan, Sri Gunabhushan Reddy, Sri Vijay Kumar, Smt Varalakshmi, Smt Shanti, Sri Devendra Babu, Sri Venkataiyya, Sri Sivaprasad, and officials of SV temples at Rishikesh, Kurukshetra, Kanya Kumari, Bhuvaneshwar and Jammu participated in the virtual meeting. 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ఆలయాల వద్ద పక్కాగా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలి : జెఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి, 2023 జూన్‌ 24: సుదూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు సులువుగా గుర్తించి దర్శించుకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని టీటీడీ ఆలయాల వద్ద పక్కాగా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. టీటీడీ స్థానికాలయాలు, బయటి ప్రాంతాల్లోని ఆలయాల అధికారులతో శనివారం జెఈవో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆలయాలకు భక్తుల సంఖ్యను పెంచేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టాలన్నారు. తిరుమల తరహాలో భక్తుల కోసం యూపీఐ పేమెంట్స్ ని ప్రోత్సహించాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న ఇంజినీరింగ్ పనులపై సమీక్షించారు. ప్రతి ఆలయంలోనూ దాతల సాయంతో అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయాల్లో డొనేషన్ రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించారు. భక్తుల అవసరాలకు తగినట్టు అన్ని వసతులు కల్పించాలన్నారు. సీసీటీవీల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని, మరుగుదొడ్ల వద్ద చక్కటి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా అన్న ప్రసాదం దిట్టం పెంచాలన్నారు.

ఈ సమీక్షలో డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్‌, శ్రీ గుణభూషణ్‌రెడ్డి, శ్రీ విజయకుమార్‌, శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి శాంతి, శ్రీ దేవేంద్ర బాబు, శ్రీ వెంకటయ్య, శ్రీ శివప్రసాద్, రిషికేష్‌, కురుక్షేత్ర, కన్యాకుమారి, భువనేశ్వర్‌, జమ్మూ తదితర ఆలయాల అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.