జనవరి 31న ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో అఖండగాన యజ్ఞం

జనవరి 31న ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో అఖండగాన యజ్ఞం

తిరుపతి, జనవరి 30, 2013: శ్రీ త్యాగరాజస్వామివారి 166వ వర్ధంతిని పురస్కరించుకుని జనవరి 31వ తేదీన  తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత మరియు నృత్య కళాశాలలో 27 గంటల పాటు మూడవ త్యాగరాజ అఖండ గానయజ్ఞం ఘనంగా జరుగనుంది.
సంగీత కళాశాల, నాదస్వర పాఠశాలలోని తొమ్మిది విభాగాలకు చెందిన 45 మంది అధ్యాపకులు, 63 మంది విద్యార్థినీ విద్యార్థులు కలిపి మొత్తం 108 మంది ఈ గానయజ్ఞంలో పాల్గొంటారు. 135 అపురూప రాగాలతో, 261 అపూర్వ త్యాగరాజ కృతులతో ఈ యజ్ఞం సాగుతుంది.
గురువారం ఉదయం 8.00 గంటలకు శ్రీ వి.సత్యనారాయణ నాదస్వర వాద్యంతో ప్రారంభమై శుక్రవారం ఉదయం 11.00 గంటల వరకు నిరంతరాయంగా అఖండ గానయజ్ఞం జరుగనుంది.
     
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.