SRINIVASA KALYANAM HELD AT JAMMU TEMPLE _ జమ్మూ శ్రీవారి ఆల‌యంలో వైభవంగా శ్రీవారి కల్యాణం

Tirumala, 08 June 2023: The celestial Srinivasa Kalyanam was held with utmost religious fervour at Sri Venkateswara temple premises in Jammu on Thursday evening.

The processional deities of Sri Bhu sameta Sri Srinivasa were seated on the finely decked platform.

The Archakas performed the divine wedding as per Hindu tradition chanting Vedic Mantras. The series of events included Vishwaksena Aradhana, Punyahavachanam, Kankana Dharana, Agni Pratistapana, Sankalpam, Mangalasutra Dharana, Nakshatra Harati and concluded with Mangala Harati.

The devotees were spellbound by the divine power and witnessed the entire event with spiritual ecstasy.

DyEOs Sri Gunabhushan Reddy, Sri Siva Prasad, EE Sri Sudhakar, DyEEs Sri Raghavaiah, Sri Chengalrayalu, AEO Sfi Krishna Rao, Superintendent Sri Subrahmanyam, temple inspector Sri Saikrishna and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
జమ్మూ శ్రీవారి ఆల‌యంలో వైభవంగా శ్రీవారి కల్యాణం
 
తిరుమల, 08 జూన్ 2023: జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి  ఆలయంలో గురువారం సాయంత్రం శ్రీవారి క‌ల్యాణం వేడుకగా జరిగింది.
 
ముందుగా వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన జమ్మూ భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు.
 
 ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ శివప్రసాద్, ఇఇ శ్రీ సుధాకర్, డెప్యూటీ ఇఇలు శ్రీ రఘువర్మ, శ్రీ చెంగల్రాయలు, ఏఈవో శ్రీ కృష్ణారావు, సూపరింటెండెంట్ శ్రీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.