SRI VENKATESWARA IS THE “VIRAT SWARUP” OF HINDU SANATANA DHARMA-Lt GOVERNOR _ హిందూ సనాతన ధర్మ విరాట్ స్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడు : జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా

SRIVARI TEMPLES AS A PART OF TTD’S MISSION TO PROPAGATE HINDU SANATANA DHARMA-TTD CHAIRMAN

 

BESIDES ITS DHARMIC ACTIVITIES, TTD IS ALSO THE BIGGEST SOCIAL REFORMER-UNION MINISTER KISHEN REDDY

 

IT’S A CELEBRATION OF UNITY IN DIVERSITY-CABINET MINISTER JITENDER SINGH

 

TIRUMALA, 08 JUNE 2023: Sri Venkateswara is the Virat Swarup of the Hindu Sanatana Dharma and He travelled all the way from Seshachala Ranges to reach Jammu today to bless the people of this place bestowed with peace and prosperity”, advocated the Honourable Lt Governor of Jammu and Kashmir Sri Manoj Sinha.

 

In his address after the opening of Sri Venkateswara Swamy temple in the Majin village in Jammu on Thursday after Maha Samprokshanam, he said, Lord Venkateswara is fondly called by devotees in different names as Balaji, Govinda, Srinivasa and many more. Quoting several shlokas from Bhagavat Gita and references from religious texts, he said, Lord Venkateswara is the Universal Supremo who is the creator, protector and ruler of the world. He took the incarnation for the welfare of mankind. 

 

Adding further he said, “With the emergence of Sri Venkateswara Swamy temple in Jammu, the people of the state will now have the blessings of Lord Balaji along with Mata Vaishno Devi, Amarnath and Sarada Devi temples. Under the able leadership of our visionary Prime Minister Sri Narendra Modiji, a lot of spiritual and welfare activities have been taking place in Jammu and Kashmir. With the series of recent religious events that took place in the recent past in Jammu, I am confident that this place is soon to become the hub of the Religious Tourism Circuit. I am also happy to state that very soon a Veda Pathashala will also be coming up in this place. I congratulate all of you on this historical occasion”, he maintained.

 

Later in his speech, TTD Chairman Sri YV Subba Reddy said, TTD has taken up the construction of a series of Sri Venkateswara temples from Kashmir to Kanyakumari in a big way with a noble aim to take forward Hindu Sanatana Dharma across the country. He said besides important places, TTD has also been constructing temples in SC, ST, BC and fishermen colonies and very recently Sri Venkateswara temples were opened in Tribal and backward areas of Seetampeta and Rampachodavaram respectively. “An exclusive temple dedicated to Goddess Sri Padmavathi Devi was also constructed in Chennai, the first of its kind in the country. On June 7, we performed Bhoomi Pooja towards the construction of the temple in Navi Mumbai which is coming up at a cost of Rs.60-75cr in a sprawling 62acres of land. Besides constructing temples, TTD is also performing Sri Venkateswara Vaibhavotsavams, Srinivasa Kalyanams etc. on a large scale to take the glory of Lord Balaji to the doorsteps of His devotees in many places. 

 

He also said, “On behalf of the Honourable Chief Minister of Andhra Pradesh Sri YS Jaganmohan Reddy I express my sincere thanks to the Lt Governor Sri Manoj and the Jammu and Kashmir Government for allotting 62 acres of land towards the construction of Srivari temple in Jammu. The Lord Venkateswara temple emerged at a cost of Rs.30cr and another five cores will be spent to set up a Veda Pathashala, Kalyana Mandapam etc.  I also thank the Union Home Minister Sri Amit Shahji, Union Ministers Sri Kishen Reddyji and Sri Jitender Singhji, other dignitaries, for extending their full support in making the temple of Sri Venkateswara Swamy at Jammu a reality. May Lord Venkateswara bless the people of Jammu with happiness and prosperity forever”, he maintained.

 

Union Minister Sri Kishen Reddy lauded the efforts of Lt Governor of Jammu, TTD Chairman and LAC Chief Smt Prasanthi Reddy behind the speedy construction of Sri Venkateswara temple and making the dream come true for the people of Jammu. Appreciating the dharmic activities of TTD, he said, besides taking forward several spiritual programmes like distribution of devotional books, constructing temples in backward areas to avoid conversions, TTD is also doing a lot of social service activities like running veda pathashalas, deaf and dumb schools, super speciality hospitals etc.to meet the requirements of the needy. I also thank the honourable CM of Andhra Pradesh, TTD Board Chairman and members and all the officers who are involved behind this divine mission of the construction of Sri Venkateswara Swamy temple at Jammu”, he maintained.

 

Speaking on the occasion, Sri Jitender Singh, the Honourable Cabinet Minister described the emergence of Sri Balaji temple as a celebration of Unity in Diversity as Lord Venkateswara traversed all the way from Tirupati to Jammu to bless His devotees of this place. 

 

MPs Sri Prabhakar Reddy, Sri Jugal Kishore Sharma, Mayor Sri Rajender Sharma, Chief Secretary Dr Arun Kumar Mehta, DDC Chairman Sri Bharat Bhushan, Divisional Commissioner Sri Ramesh Kumar and other dignitaries were also present.

 

TTD Board members Sri Krishna Rao, Sri Milind Kesav Narvekar, New Delhi Local Advisory Chief Smt Vemireddi Prasanthi Reddy, Chennai Local Advisory Committee Chairman Sri Sekhar Reddy also participated while among TTD officials, JEO Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, SEs Sri Satyanarayana, Sri Venkateswarulu, EE Sri Sudhakar, DyEOs Sri Gunabhushan Reddy, Sri Siva Prasad, VGOs Sri Manohar, Sri Giridhar Rao, Garden Deputy Director Sri Srinivasulu, PRO Dr T Ravi, DyEEs Sri Chengalrayalu, Sri Raghu Verma, AEO Sri Krishna Rao and others were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

హిందూ సనాతన ధర్మ విరాట్ స్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడు : జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా
 
– హిందూ సనాతన ధర్మప్రచారమే లక్ష్యంగా  శ్రీవారి ఆలయాలు : టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి
 
– టీటీడీ ఆధ్వర్యంలో విస్తృతంగా సామాజిక కార్యక్రమాలు :  కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి 
 
– ఈ వేడుక భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక : కేంద్ర మంత్రి శ్రీ జితేందర్ సింగ్‌
 
తిరుమల, 08 జూన్ 2023: హిందూ సనాతన ధర్మంలో శ్రీ వేంకటేశ్వరుడు విరాట్ స్వరూపుడని, జమ్మూ ప్రజలకు శాంతి, శ్రేయస్సును ప్రసాదించేందుకు శేషాచల కొండల నుండి ఇక్కడికి విచ్చేశారని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ శ్రీ మనోజ్ సిన్హా ఉద్ఘాటించారు. జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి(సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ గురువారం ఆగమోక్తంగా జరిగింది.  ఈ సందర్భంగా ఆలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
 
ఈ కార్యక్రమానికి విచ్చేసిన లెఫ్టినెంట్ గవర్నర్‌ ప్రసంగిస్తూ వేంకటేశ్వరుడిని భక్తులు బాలాజీ, గోవింద, శ్రీనివాస, మరెన్నో పేర్లతో ముద్దుగా పిలుస్తారని చెప్పారు. భగవద్గీత, ఇతర పురాణాల నుండి పలు శ్లోకాలు చెబుతూ మానవాళి శ్రేయస్సు కోసం అవతారమెత్తిన శ్రీ వేంకటేశ్వరుడు ప్రపంచానికి సృష్టికర్త, రక్షకుడు, పాలకుడన్నారు. జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణంతో మాతా వైష్ణోదేవి, అమరనాథ్, శారదాదేవి ఆలయాలతో పాటు స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకోవచ్చన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్‌లో అనేక ఆధ్యాత్మిక, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. జమ్మూలో ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక కార్యకలాపాలు పెరిగాయని, ఇది రిలీజియస్ టూరిజం సర్క్యూట్ గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో ఈ ఆలయ ప్రదేశంలో వేదపాఠశాల కూడా రానుందని చెప్పారు. ఈ సందర్భంగా భక్తులందరికీ అభినందనలు తెలియజేశారు.
 
టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రసంగిస్తూ హిందూ సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలనే లక్ష్యంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీవేంకటేశ్వర ఆలయాల నిర్మాణాన్ని  పెద్దఎత్తున చేపట్టామన్నారు. ప్రముఖ నగరాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారుల కాలనీల్లో కూడా ఆలయాలను నిర్మిస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాలైన సీతంపేట, రంపచోడవరంలో ఇటీవల శ్రీవేంకటేశ్వర ఆలయాలను ప్రారంభించామన్నారు. చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం   నిర్మించామని, తిరుచానూరు తరువాత ఇది రెండోదని తెలిపారు. నవీ ముంబైలో  62 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 – 75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆలయ నిర్మాణానికి జూన్ 7న భూమి పూజ చేశామన్నారు.  టీటీడీ పెద్ద ఎత్తున శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు, శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తోందని చెప్పారు.
 
జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 62 ఎకరాల భూమిని కేటాయించినందుకు లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఇప్పటికే రూ.30 కోట్ల వ్యయం చేశామని, వేదపాఠశాల, కల్యాణ మండపం తదితరాల కోసం మరో రూ.5 కోట్లు వెచ్చిస్తామన్నారు. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా, కేంద్రమంత్రులు శ్రీ కిషన్ రెడ్డి, శ్రీ జితేందర్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు. 
 
కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని త్వరగా నిర్మించి జమ్మూ ప్రజల కలను సాకారం చేయడం వెనుక లెఫ్టినెంట్ గవర్నర్, టీటీడీ చైర్మన్, శ్రీమతి ప్రశాంతి రెడ్డి కృషిని కొనియాడారు. టీటీడీ చేస్తున్న ధార్మిక కార్యక్రమాలను అభినందించారు. ఆధ్యాత్మిక పుస్తకాల పంపిణీ, మతమార్పిడులు జరగకుండా వెనుకబడిన ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణంతోపాటు వేదపాఠశాలలు, బధిర పాఠశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్వహణ వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను టీటీడీ చేస్తోందన్నారు. జమ్మూలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిటిడి బోర్డు ఛైర్మన్, సభ్యులందరికీ, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
 
శ్రీ జితేందర్ సింగ్ మాట్లాడుతూ శ్రీ బాలాజీ ఆలయ నిర్మాణాన్ని భిన్నత్వంలో ఏకత్వ వేడుకగా అభివర్ణించారు. ఇక్కడి భక్తులను ఆశీర్వదించడానికి వేంకటేశ్వరుడు తిరుపతి నుండి జమ్మూ వరకు విచ్చేశారన్నారు.
 
 ఎంపీలు శ్రీ ప్రభాకర్ రెడ్డి, శ్రీ జుగల్ కిషోర్ శర్మ, మేయర్ శ్రీ రాజేందర్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. అరుణ్ కుమార్ మెహతా, డిడిసి ఛైర్మన్ శ్రీ భరత్ భూషణ్, డివిజనల్ కమిషనర్ శ్రీ రమేష్ కుమార్ మరియు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
 
 టిటిడి బోర్డు సభ్యులు శ్రీ కృష్ణారావు, శ్రీ మిలింద్ కేశవ్ నర్వేకర్, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శ్రీ శేఖర్ రెడ్డి, టిటిడి అధికారులు జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇలు శ్రీ సత్యనారాయణ, శ్రీ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీ సుధాకర్, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ శివ ప్రసాద్, వీజీవోలు శ్రీ మనోహర్, శ్రీ గిరిధర్ రావు, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, పీఆర్వో డాక్టర్ టి రవి, డెప్యూటీ ఈఈలు శ్రీ చెంగల్రాయలు, శ్రీ రఘు వర్మ, ఏఈవో శ్రీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.