జూన్‌ 26న అనంతపురంలో శ్రీనివాస కల్యాణం

జూన్‌ 26న అనంతపురంలో శ్రీనివాస కల్యాణం

తిరుపతి, జూన్‌ 24, 2013: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూన్‌ 26వ తేదీన శ్రీనివాస కల్యాణం వైభవంగా జరుగనుంది.

అనంతపురంలోని ఎస్‌ఎస్‌బిఎన్‌ జూనియర్‌ కళాశాల మైదానంలో జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఓఎస్‌డి శ్రీ కె.రామకృష్ణ ఈ కల్యాణోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శ్రీవారి కల్యాణోత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా ఈ వేదికపై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు జూన్‌ 24 నుండి 26వ తేదీ వరకు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేయనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.