PAVITHROTSAVAM FESTIVAL AT SRI KT FROM JULY 2 TO JULY 4 _ జూలై 1 నుంచి శ్రీ కపిలేశ్వర స్వామి పవిత్రోత్సవాలు

జూలై 1 నుంచి శ్రీ కపిలేశ్వర స్వామి పవిత్రోత్సవాలు

తిరుపతి. 2020 జూన్ 29: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలు జూలై 1 నుంచి 4వతేదీ వరకు నిర్వహిస్తారు.

ఉత్సవాల్లో భాగంగా 1వ తేదీ బుధవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 – 30 గంటల వరకు అంకురార్పణ జరుగుతుంది. 2వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కలశ పూజ , హోమం, పవిత్ర ప్రతిష్ట చేస్తారు. 3వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హోమం, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు యాగశాల పూజ, హోమం జరుగుతాయి. 4వ తేదీ శనివారం ఉదయం 6 -30 గంటల నుంచి మధ్యాహ్నం 12 – 30 గంటల వరకు మహాపూర్ణాహుతి,యాగశాల పూజ, హోమం, పూర్ణాహుతి, కలశం ఉద్వాసన, అభిషేకం, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 -30 గంటల నుంచి శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ చండికేశ్వర స్వామి వార్లను ఆలయం లోనే ఊరేగిస్తారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పవిత్రోత్సవాల కార్యక్రమాలు, ఊరేగింపు అన్నీ ఆలయంలోనే నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.  

Tirupati, 29 Jun. 20: TTD is organising a grand three-day annual Pavitrotsavam festival at Sri Kapileswara Swamy temple from July 2 to 4 with Ankurarpanam on July 1 evening.

On July 2, Snapana Tirumanjanam is performed for utsava idols. Later in the evening 6-9 pm Homa, Kalasa Puja and Pavitra Samarpana is done. Rituals will continue on Friday and on Saturday. 

On the concluding day special rituals of Purnahuti, Kalasa Udwasana, Abhisekam and Pavitra samarpana are performed.

Later in the evening grand procession within temple premises grand procession of deities will be conducted. 

In view of Corona COVID 19 guidelines and restrictions all rituals, processions of Pavitrotsavams are performed within the temple premises only.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI