REGULAR CHECK-UPS FOR PILGRIMS AT ALIPIRI – TTD EO _ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు: టీటీడీ ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్
RANDOM SAMPLE TEST FOR 100 EMPLOYEES DAILY IN TIRUMALA
Tirupati, 29 Jun. 20: TTD will continue Corona testing for the devotees visiting Tirumala without any compromise, said TTD Executive Officer Sri Anil Kumar Singhal.
A review meeting was held in the Chamber of EO at TTD Administrative Building on Monday with District Collector Sri Bharat Narayan Gupta and other officials.
After the review meeting, the EO said TTD will do random testing to a minimum of 100 employees every day discharging duties at various places in Tirumala. The EO asked the Collector to provide the reports within 24 hours after testing. All TTD employees working at Tirumala are also directed to work at one place for a week without shifting their duty areas.
He directed the JEO TTD Sri P Basant Kumar to provide additional ventilators at the TTD central hospital for benefit of employees. He also instructed the JEO to handover Srinivasam Rest House to District Collector. The EO said, if needed, a decision will be taken during next review meeting whether to use the BIRRD Ortho Hospital into a Covid-19 Centre.
The EO said, if necessary the Madhavam Rest House which is already earmarked as a Quarantine Centre will be used for TTD employees and their kin. A team of officials and staffs headed by a Dy EO will be deployed to monitor the quarantine facilities for TTD employees and their family members”, he added.
Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Goliath Jetty, Dy Collector Sri Srinivas, DMHO Dr Penchalaiah, TTD Health Officer Dr RR Reddy were also present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు: టీటీడీ ఈ ఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్
తిరుపతి 2020 జూన్ 29: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అలిపిరి వద్ద క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించాలని టీటీడీ ఈ ఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన ఛాంబర్లో అదనపు ఈ ఓ శ్రీ ఏ వి ధర్మారెడ్డి, జె ఈ ఓ శ్రీ పి.బసంత్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్త, సివి ఎస్ ఓ శ్రీ గోపినాథ్ జెట్టి లతో సమావేశమయ్యారు. తిరుమలో పని చేసే ఉద్యోగుల నుంచి రోజుకు 100 కరోనా టెస్టు శాంపిల్స్ తీయాలని అధికారులను ఆదేశించారు. ఈ టెస్ట్ ల రిపోర్టులు 24 గంటల్లోగా వచ్చే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఈ ఓ కోరారు.
తిరుమలలో పనిచేసే ఉద్యోగులు వారం రోజులు ఒకే చోట పనిచేసేలా డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి సెంట్రల్ హాస్పిటల్లో ఉద్యోగుల కోసం కొన్ని వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పరిస్థితిని సమీక్షించి బర్ద్ ఆసుపత్రిని కరోనా రోగుల చికిత్సకు ఉపయోగించే విషయంపై వారంలో నిర్ణయం తీసుకుంటామని శ్రీ సింఘాల్ చెప్పారు. తిరుపతిలోని శ్రీనివాసం యాత్రికుల సముదాయాన్ని జిల్లా కలెక్టర్ కు అప్పగించాలని జెఈఓ ను ఆదేశించారు. టీటీడీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా క్వారంటైన్ అవసరమైతే మాధవంలో ఏర్పాట్లు చేయాలన్నారు. వీటి పర్యవేక్షణకు ఒక డిప్యూటీ ఈఓ, ఇద్దరు ఏఈఓలు, అవసరమైనంత మంది సిబ్బందిని నియమించి, వైద్య పరికరాలను యూఏర్పాటు చేయాలన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి శ్రీ పెంచలయ్య, డిప్యూటీ కలెక్టర్ శ్రీ శ్రీనివాస్ , టీటీడీ ఆరోగ్యాధికారి శ్రీ ఆర్ ఆర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.