జూలై 19 నుండి 21వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

జూలై 19 నుండి 21వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, జూలై 16, 2013: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 19 నుండి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. జూలై 18వ తేదీ అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో పౌర్ణమి ముందున్న చతుర్దశి నాటికి పూర్తయ్యేలా మూడు రోజుల పాటు స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు గ్రంధి పవిత్ర సమర్పణ, మూడో రోజు మహాపూర్ణాహుతి క్రతువులు నిర్వహిస్తారు.

ఈ పవిత్రోత్సవంను ఆర్జితం సేవగా ప్రవేశ పెట్టారు. రూ.500 చెల్లించి ఇద్దరు గృహస్థులు పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె బహుమానంగా అందజేస్తారు.
              
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది