TTD JEO (H&E) INSPECTS _ జేఈవో పరిశీలన

TIRUPATI, 30 MARCH 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi on Thursday evening inspected the newly constructed Ayurvedic Pharmacy, the second unit of Agarbattis manufacture and the Feed Mixing plant in SV Goshala.

TTD Chairman Sri YV Subba Reddy and EO Sri AV Dharma Reddy will commence all these three new buildings on Friday. In this connection, the JEO inspected the ongoing arrangements for the same along with officials concerned and given them some suggestions.

DE Sri Nageswara Rao, Goshala Director Dr Harinath Reddy, EEs Sri Manoharam, Sri Muralikrishna, DE Smt Saraswathi, Technical officer of Ayurveda Pharmacy Dr Narappa Reddy were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జేఈవో పరిశీలన

తిరుపతి 30 మార్చి 2023: శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసీ లో నూతనంగా నిర్మించిన మందుల తయారీ కేంద్రాన్ని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి గురువారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం ఎస్వీ గోశాలలో నిర్మించిన పరిమళ భరిత అగర బత్తీల తయారీ రెండో యూనిట్ , నూతనంగా నిర్మించిన ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ను పరిశీలించారు. శుక్రవారం ఉదయం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఈ మూడు ప్లాంట్లను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను జేఈవో శ్రీమతి సదా భార్గవి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, ఈ ఈ లు శ్రీ మనోహర్, శ్రీ మురళీకృష్ణ, డి ఈ శ్రీమతి సరస్వతి, ఆయుర్వేద ఫార్మసీ సాంకేతిక అధికారి డాక్టర్ నారప రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది