DHWAJAROHANAM HELD IN CHANDRAGIRI RAMALAYAM _ ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా చంద్రగిరి శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 30 MARCH 2023: The annual brahmotsavams in Sri Kodandarama Swamy temple at Chandragiri commenced in a ceremonious manner with Dhwajarohanam on Thursday.

The Garuda flag hoisting ritual took place in the auspicious Mesha Lagnam between 7.45am and 8.15am.

The important days includes Hanumanta Vahanam on April 3, Sri Sita Rama Kalyanam on April 5 at 10am and Garuda Seva on the same day evening at 6pm.

On April 7, Chakra Snanam and on April 8 Sri Rama Pattabhishekam will be observed.

Every day there will be devotional programmes in the evening till the completion of annual fete.

Temple DyEO Sri Devendra Babu, AEO Sri Partasaradhi, Superintendent Sri Srinivasulu, Temple Inspector Sri Gopala Krishna, archakas participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా చంద్రగిరి శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2023 మార్చి 30: చంద్రగిరి శ్రీకోదండరామస్వామివారి ఆల‌యంలో గురువారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా స‌క‌ల‌దేవ‌త‌ల‌ను బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆహ్వానిస్తూ ఉద‌యం 7.45 నుండి 8.15 గంట‌ల మ‌ధ్య మేష ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం ఘ‌ట్టాన్ని నిర్వ‌హించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేప‌ట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల రామనామస్మ‌ర‌ణ‌ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ శ్రీ‌నివాస‌భ‌ట్టార్‌ ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ పార్థ సారధి, సూపరిండేంట్ శ్రీ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ గోపాల కృష్ణ, భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.