THREE DAY PULSE POLIO PROGRAM IN TIRUPATI FROM JAN 31 TO FEB 02 _ జ‌నవ‌రి 31 నుండి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వరకు తిరుపతిలో పల్స్‌పోలియో

Tirupati, 30 January 2021: TTD is organising a three-day pulse polio program in the temple town from January 31- February 2 at all medical camps from 7am till 6pm.

CMO of TTD Medical wing Dr AB Narmada said necessary medical staff and NCC cadets with equipment are all kept in readiness for serving pulse polio drops to infants below five years.  

She said pulse polio camps were set up at TTD Central Hospital, Srinivasam complex, Bairagi Patteda Medical Centre, Alipiri, Alipiri bus stand, Railway station etc.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌నవ‌రి 31 నుండి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వరకు తిరుపతిలో పల్స్‌పోలియో

తిరుపతి, 2021 జ‌నవ‌రి 30 : టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో జ‌నవ‌రి 31 నుండి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు విడత పల్స్‌పోలియో కార్యక్రమం జరుగనుంది.

 ఇందుకోసం టిటిడి వైద్య విభాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ముఖ్య వైద్యాధికారి డాక్ట‌ర్ ఎబి.న‌ర్మ‌ద తెలిపారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఇందుకోసం వైద్యసిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు, ఇతర సిబ్బంది సేవలందిస్తారని తెలిపారు.  

ప్రతిరోజూ ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు శిబిరాల్లో పోలియో చుక్కలు వేస్తారు. తిరుపతిలోని టిటిడి కేంద్రీయ వైద్యశాల, శ్రీనివాసం కాంప్లెక్స్‌, బైరాగిపట్టెడ వైద్య కేంద్రం, అలిపిరి, అలిపిరి బస్‌స్టాండ్‌, రైల్వేస్టేషన్‌ ప్రాంతాలలో శిబిరాలను ఏర్పాటుచేశారు. ఇందుకోసం వైద్యసిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు, ఇతర సిబ్బంది సేవలందిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.