GOLD ORNAMENTS DONATED TO SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారికి బంగారు ఆభరణాల బహూకరణ
The Ornaments comprised of Three Gold Crowns and Three Pairs of Gold Ear Rings for Utsava idols of Sridevi, Sri Bhudevi and Sri Govindaraja Swami. After ceremonious pujas the Ornaments were Decorated on the Utsava idols.
శ్రీ గోవిందరాజస్వామివారికి బంగారు ఆభరణాల బహూకరణ
తిరుపతి, 2021 జనవరి 30: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి శనివారం సాయంత్రం రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామిలు కలిసి బహూకరించారు.
ఇందులో మూడు బంగారు కిరీటాలు, మూడు జతల కర్ణాభరణాలు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి సమర్పించారు.
అనంతరం ఆభరణాలకు ఆలయంలో శాస్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు అలంకరించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీరాజేంద్రుడు, టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ ఎన్ఎకె.సుందరవరదన్, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కృష్ణమూర్తి, శ్రీ కామరాజు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.