JEO FOR MEDICAL AND EDUCATION INSPECTS SCHOOLS_ టిటిడి పాఠ‌శాల‌ల్లో ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఏర్పాట్లు జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీమ‌తి ఎస్‌.భార్గ‌వి త‌నిఖీలు

Tirupati, 7 Oct. 20: The Joint Executive Officer for Health and Education, Smt Sada Bhargavi paved inspection to TTD schools on Wednesday evening.

She inspected SV High School, SP High School, Deaf and Dumb School, Tatitopu High School, Sri Kodandarama Swamy High School and verified the mode of teaching practices and covid norms being followed in these schools.

She instructed the officials concerned to complete the civil and electrical works if any.

SE 1 Sri Jagadeeshwar Reddy, SE Electrical Sri Venkateswarulu, Education Officer Sri Ramana Prasad were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి పాఠ‌శాల‌ల్లో ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఏర్పాట్లు

జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీమ‌తి ఎస్‌.భార్గ‌వి త‌నిఖీలు

తిరుప‌తి‌, 2020 అక్టోబ‌రు 07: తిరుప‌తిలో టిటిడి నిర్వ‌హిస్తున్న పాఠ‌శాల‌ల‌ను బుధ‌‌వారం టిటిడి జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీమ‌తి ఎస్‌.భార్గ‌వి అధికారుల‌తో క‌ల‌సి త‌నిఖీ చేశారు.
 
ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌‌,  ఎస్వీ బ‌దిర పాఠ‌శాల‌, శ్రీ ప‌ద్మావ‌తి బాలిక‌ల ఉన్న‌త పాఠ‌శాల‌‌, శ్రీ కోదండ‌రామ‌స్వామి ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌, తాటితోపులోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామి ఉన్న‌త పాఠ‌శాలల‌ను జెఈవో త‌నిఖీ చేశారు. త్వ‌ర‌లో పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానుండ‌డంతో కోవిడ్‌-19 నేప‌థ్యంలో ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా చేప‌ట్టాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప‌లు సూచ‌న‌లు చేశారు. త‌ర‌గ‌తి గ‌దుల్లో భౌతిక‌దూరం పాటించేలా మార్కింగ్ చేయాల‌న్నారు. హాస్ట‌ళ్లు తెరిచిన అనంత‌రం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పైనా అధికారుల‌తో చ‌ర్చించారు. అన్ని పాఠ‌శాల భ‌వ‌నాల్లో మ‌రుగుదొడ్లు, మురుగునీటి కాల్వ‌లు, స్విచ్ బోర్డులు, నీటి కొళాయిల‌ను ప‌రిశీలించారు. అవ‌స‌ర‌మైన చోట్ల వెంట‌నే సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, వాట‌ర్ వ‌ర్క్స్ మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు.‌

జెఈవో వెంట టిటిడి విద్యాశాఖాధికారి డా. ఆర్‌.ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, ఎస్ఇ-1 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.