AP MINISTER VISITS TTD PUBLICATIONS WING _ టిటిడి ప్రచురణల విభాగాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

TIRUPATI, 09 NOVEMBER 2022: Honourable State Minister Sri Rajendranath Reddy visited the TTD Publications wing on Wednesday.

He suggested the officials, concerned officials, to print Hindu Dharmic books which attracts Youth and Aged and also exclusive books for children with impressive images.

He also said TTD should adopt new technology and compete with Private companies in bringing out qualitative publications.

DyEO Sri Govindarajan, scholars Dr Samudrala Lakshmanaiah, Special Officer Printing Press Sri Ramaraju, Annamacharya Project Director Dr Vibhishana Sharma, Publications Special Officer Sri Venkatakrishna Sastry, Editor Dr Chokkalingam were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ప్రచురణల విభాగాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
 
తిరుపతి, 2022 నవంబరు 09: రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం టిటిడి ప్రచురణల విభాగాన్ని, ముద్రణాలయాన్ని పరిశీలించారు. 
 
సనాతన హిందూ ధర్మాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా పిల్లలకు, యువకులకు, మధ్య వయస్కులకు, వృద్ధులకు ఆసక్తికరంగా ఉండేలా పుస్తకముద్రణ చేపట్టాలన్నారు. పిల్లలకు బొమ్మలతో కూడిన పుస్తకాలు రూపొందించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని ప్రయివేటు పబ్లిషర్లకు దీటుగా ముద్రణ చేపట్టాలన్నారు.
 
టిటిడి డెప్యూటీ ఈఓ శ్రీ గోవిందరాజన్, పండితులు డా. సముద్రాల లక్ష్మయ్య, ముద్రణాలయం ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణ శర్మ,  ప్ర‌చుర‌ణ‌ల విభాగం ప్ర‌త్యేకాధికారి ఆచార్య రేమిళ్ల వెంక‌ట‌కృష్ణ‌శాస్త్రి, ఎడిట‌ర్ డా.చొక్క‌లింగం పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.