తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం దెబ్బతిన్న విషయాన్ని టీటీడీ సిబ్బంది ముందుగానే గుర్తించడం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోలేదు.

తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం దెబ్బతిన్న విషయాన్ని టీటీడీ సిబ్బంది ముందుగానే గుర్తించడం జరిగింది. ఘటనలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోలేదు.

తిరుమల, 2026 సెప్టెంబరు 08: శ్రీవారి ఆలయ మహా గోపురంపై వందలాది విగ్రహాలు ఉన్న విషయం తెలిసిందే. దీర్ఘకాలంగా ఎండ, వర్షాలకు గురికావడంతో కొన్ని విగ్రహాలకు మరమ్మతులు అవసరం అయ్యే అవకాశం ఉంటుంది. 

ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ గోపురానికి పెయింటింగ్, మరమ్మతుల పనులు చేపడుతున్న సమయంలో విగ్రహాల పరిస్థితిని పరిశీలించి, అవసరాన్ని బట్టి  విగ్రహాలకు మరమ్మతులు చేయడంగానీ లేదా వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం టీటీడీ చేపడుతోంది.

ఇదే క్రమంలో గోపురానికి పెయింటింగ్, మరమ్మతుల పనులు చేపడుతున్న సమయంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి మరమ్మతులు అవసరమైన  విషయాన్ని టీటీడీ గుర్తించింది. వెంటనే సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై వాస్తవాలను తెలుసుకోకుండా దురుద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం సరికాదని టీటీడీ స్పష్టం చేస్తుంది.

ఆలయ పవిత్రతకు సంబంధించిన అంశాలపై భక్తుల్లో అపోహలు, ఆందోళనలు కలిగించేలా దుష్ప్రచారం చేయవద్దని టీటీడీ హితవు పలికింది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చేత విడుదల చేయబడినది