TTD CHAIRMAN INAUGURATES TWO-WHEELERS PARKING FOR TTD EMPLOYEES AT ALIPERI _ టీటీడీ ఉద్యోగుల కోసం పార్కింగ్ షెడ్ ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

Tirupati,28 October 2022: TTD Chairman Sri YV Subba Reddy on Friday inaugurated a two-wheeler parking facility near the Alipiri link bus station for TTD employees at a cost of ₹54 lakhs.

Speaking to reporters later the Chairman said that the on-duty employees of Tirumala usually park their two-wheelers at Alipiri link bus station which were often found damaged or stolen.

Hence TTD took initiative for its employees vehicles’ security and constructed exclusive parking sheds.

In pursuit of its motto for environmental protection the TTD also intends to provide electrical two-wheelers to employees with support from donors and also bank loans, he said.

Among others the Chairman said very soon the SSD counters will be reopened at Tirupati, change in VIP break Darshan timings will also be implemented on a trial-basis.

Tirupati MLA Sri Bhumana Karunakar Reddy, TTD EO Sri AV Dharma Reddy, TTD board member Sri P Ashok Kumar, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CE Sri Nageswara Rao, VGO Sri Manohar were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ఉద్యోగుల కోసం పార్కింగ్ షెడ్ ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 28 అక్టోబరు 2022: అలిపిరి లింక్ బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం నిర్మించిన షెడ్ ను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు .

అనంతరం శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో విధులు నిర్వహించే టీటీడీ ఉద్యోగులు అలిపిరి బస్టాండ్ ప్రాంతంలో తమ ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసి వెళుతున్నారని చెప్పారు. ఇలాంటి వాహనాలు కొన్ని చోరీ, డ్యామేజ్ కావడం జరుగుతోందని ఆయన చెప్పారు. ఉద్యోగుల వాహనాలకు భద్రత కల్పించేందుకు రూ 54 లక్షలతో ప్రత్యేకంగా పార్కింగ్ షెడ్ నిర్మించామని చైర్మన్ తెలిపారు. తిరుమల పర్యావరణ పరిరక్షణలో భాగంగా , కొండ మీద విధులు నిర్వహించే కొందరు ఉద్యోగులకు దాతల సహకారంతో విద్యుత్ ద్విచక్ర వాహనాలు అందించనున్నామని చెప్పారు. మిగిలిన వారు కూడా ఆసక్తి చూపితే బ్యాంకు రుణం ఇప్పించి వారికి విద్యుత్ వాహనాలను అందించే ఏర్పాటు చేస్తామని అన్నారు. తిరుపతిలో ఉచితదర్శనం స్లాటెడ్ టోకెన్ల జారీ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు .

వి ఐ పి బ్రేక్ దర్శనం సమయం మార్పుపై అధ్యయనం చేసి త్వరలోనే అమలు చేస్తామని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు . శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి , టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి , ధర్మకర్తలమందలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ , జేఈవో లు శ్రీమతి సదా భార్గవి , శ్రీ వీర బ్రహ్మం , చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు , వి జి వో శ్రీ మనోహర్ పాల్గొన్నారు .

టీటీడీ ప్రజా సబంధాల అధికారిచే జారీ చేయడమైనది