TWO SWORN IN AS MEMBERS OF TTD BOARD _ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ రామిరెడ్డి, శ్రీ అశ్వ‌ర్థ నాయ‌క్ ప్రమాణ స్వీకారం

Tirupati, 04 September 2023: Sri Ramireddy and Sri Ashwartha Nayak were sworn in as members of the TTD Trust Board at the Srivari Temple in Tirumala on Monday.

JEO Sri Veerabraham administered oath with them.

After darshan, Vedic scholars performed Vedasirvachan in Ranganayakula Mandapam.  After that, Deputy EO Sri Lokanatham presented Srivari Tirtha prasadams and portraits of Srivaru to them.

Deputy EO Smt. Kasturi Bai and other officials participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ రామిరెడ్డి, శ్రీ అశ్వ‌ర్థ నాయ‌క్ ప్రమాణ స్వీకారం

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 04: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ రామిరెడ్డి, శ్రీ అశ్వ‌ర్థ నాయ‌క్ సోమ‌వారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో వీరి చేత జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ప్రమాణ స్వీకారం చేయించారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం వీరికి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.