‘’WILL STIVE FOR STATE ART STATUS TO KALAMKARI ART- TTD CHAIRMAN _ కళంకారిని రాష్ట్రకళగా ప్రకటించేందుకు కృషి‘’- టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి
- 3-DAY WORKSHOP BEGINS AT SV TRADITIONAL SCULPTURE TRAINING INSTITUTE
Tirupati, 04 September 2023: All out efforts will be made to persuade the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy to declare the traditional Kalamkari art as a state art”, said TTD Chairman Sri Bhumana Karunakara Reddy.
Participating as Chief Guest at the inaugural session of the three-day workshop organised on the theme of Traditional Temple Art by the SV Traditional Sculpture Training Institute (SVITSA) in Tirupati, the Chairman said the TTD board will soon upgrade the two-year certificate course on Kalamkari into a four-year diploma course.
He said Kalamkari art was born about 30,000 years ago as a temple and bhajan hall architecture and that TTD had revived this art into a teaching course 17 years ago. TTD would soon launch a campaign to produce 1/2 feet or one feet idols of Sri Venkateswara to suit the devotional needs of every household in the country.
He said the workshop should inspire the students of the sculpture institute to harness their skills and make the role model exponents of architecture and sculpture.
Speaking on the occasion, the JEO for Health and Education Smt Sada Bhargavi said the fine arts received patronisation during Sri Karunakar Reddy’s past regime with a new building and had also announced a ₹1 lakh financial assistance to all students who completed the courses. The Chairman had hiked the prices of sculptures produced by students at the workshop. Since its inception so far 815 students of the institute had turned into sculptors and architects.
EXHIBITION OF SCULPTURES
The TTD Chairman also inaugurated an exhibition of sculptures which included temple art, statues, Sudha( cement figurines, Koyya (wood)folk statues, Panchaloha(metal) idols, traditional architecture etc.
Among others, the artefacts made from waste goods by Kumari P Sai Devika, glass works, pottery and household articles made from jute were also put on display at stalls.
TTD Board member Sri Yanadayya, DEO Sri Bhaskar Reddy, prominent Stapathi Sri Santhana Krishnan, SVETA Director Smt Prashanti, institute Principal Sri Venkat Reddy, other teachers and students were also present.
కళంకారిని రాష్ట్రకళగా ప్రకటించేందుకు కృషి
– టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి
– ఎస్వీ శిల్పకళాశాలలో ప్రారంభమైన మూడు రోజుల వర్క్‌షాప్
తిరుపతి, 2023 సెప్టెంబరు 04: కళంకారిని రాష్ట్రకళగా ప్రకటించేలా ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఒప్పిస్తానని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు . ఎస్వీ సంప్రదాయ శిల్ప శిక్షణ సంస్థలో సంప్రదాయ ఆలయ శిల్పకళలు – అనుబంధ అంశాలపై మూడు రోజుల వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛైర్మన్ మాట్లాడుతూ శిల్పకళాశాలలో కళంకారి రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సును నాలుగేళ్ల డిప్లొమా కోర్సుగా మార్చేందుకు బోర్డులో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. 30 వేల సంవత్సరాల క్రితమే శిల్పకళ ప్రారంభమైందని, కళల్లో శిల్పకళకు గొప్ప స్థానం ఉందని చెప్పారు. వేల సంవత్సరాల క్రితమే ఆలయాలు, ప్రార్థనా మందిరాల నుండి ఈ కళ ప్రారంభమైందన్నారు . ప్రపంచంలోని ప్రతి దేశ చరిత్రకు శిల్పకళ ఆధారభూతమైందని వివరించారు. శిల్పకళ విద్యార్థుల నైపుణ్యం గొప్పదన్నారు. 17 సంవత్సరాల క్రితం ఈ కళాశాల పరిస్థితి చూసి సామూహిక మార్పులు చేశానన్నారు. ఈ కళాశాల విద్యార్థులతో అర అడుగు, ఒక అడుగు మేర శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిమలు తయారు చేయించాలని గతంలో భావించానని చెప్పారు. స్వామివారు తనకు మళ్లీ అవకాశం ఇచ్చారని చెప్పారు. ఇలాంటి విగ్రహాలు ప్రతి ఇంట్లో ఉంచుకోవడం ద్వారా స్వామివారు తమతోనే ఉన్నారన్న భావన భక్తులకు కలుగుతుందని తెలిపారు. మూడు రోజుల వర్క్‌షాప్ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలని, శిల్పకళాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
జేఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ గతంలో ఛైర్మన్ శ్రీ కరుణాకర్‌రెడ్డి హయాంలోనే కళాశాలకు సొంత భవనం ఏర్పాటైందని చెప్పారు . వర్క్‌షాపులో పనిచేస్తున్న శిల్పులకు ధరలు పెంచారని చెప్పారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని శ్రీ కరుణాకర రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడే ప్రకటించారని తెలియజేశారు. అదేబాటలోనే ప్రస్తుతం పయనిస్తూ కళాశాలను ప్రగతిపథంలో నడిపిస్తున్నామని చెప్పారు. వర్క్‌షాప్‌లు నిర్వహించి విద్యార్థులకు శిల్పకళలోని మెళకువలపై అవగాహన కల్పించామని తెలిపారు. కళాశాల ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 815 మంది విద్యార్థులను శిల్పులుగా తయారు చేసినట్టు తెలియజేశారు.
శిల్పకళా ప్రదర్శన ప్రారంభం
కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన శిల్పకళాప్రదర్శనను ఛైర్మన్ ప్రారంభించారు. ఇందులో ఆలయ నిర్మాణకళ, శిలా విగ్రహాలు, సుధా(సిమెంటు) విగ్రహాలు, కొయ్య విగ్రహాలు, లోహ విగ్రహాలు, సంప్రదాయ చిత్రకళ, సంప్రదాయ కళంకారి కళ, హస్తకళా ప్రదర్శనలు ఉన్నాయి. కుమారి పి.సాయిదేవిక నిరుపయోగమైన వస్తువులతో తయారుచేసిన వివిధ కళాకృతుల స్టాల్‌ను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. గాజుసీసాలు, మట్టికుండలు, జ్యూట్‌తో తయారుచేసిన గృహాలంకరణకు ఉపయోగపడే అనేక కళాకృతులు ఈ స్టాల్‌లో ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్ఢు సభ్యులు శ్రీ యానాదయ్య, విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్‌రెడ్డి, ప్రముఖ స్థపతి శ్రీ సంతానకృష్ణన్, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వెంకటరెడ్డి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.