టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ 10 లక్షలు విరాళం

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం 

తిరుమల, 2026 అక్టోబర్ 10: తాడిపత్రికి చెందిన శ్రీ హర్షవర్ధన్ రెడ్డి అనే భక్తుడు శనివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.