DONATION OF MEDICINES WORTH RS. 18 LAKH TO TTD HOSPITALS _ టీటీడీ వైద్యశాలలకు రూ.18 లక్షల విలువైన ఔషధాల విరాళం

Tirumala, 10 October 2026: To provide better medical services to devotees during the annual Srivari Salakatla Brahmotsavams, Sri G. Shravan Kumar, Proprietor of SSK Pharma Distributors, Hyderabad, donated medicines worth Rs. 15 lakh, while Sri Talasila Venkateswara Rao, Head of Indu Drugs Private Limited, donated medicines worth Rs. 3 lakh on Saturday.

On this occasion, TTD Board Member Sri Nannapaneni Sadashiva Rao met TTD Chairman Sri B.R. Naidu at the Chairman’s Camp Office in Tirumala and handed over the medicines on behalf of the donors.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

టీటీడీ వైద్యశాలలకు రూ.18 లక్షల విలువైన ఔషధాల విరాళం

తిరుమల, 2026 అక్టోబర్ 10: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ కు చెందిన ఎస్ఎస్కే ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రొప్రైటర్ శ్రీ జి. శ్రవణ్ కుమార్ రూ.15 లక్షల విలువైన ఔషధాలను, ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీ తలశిల వెంకటేశ్వరరావు రూ.3 లక్షల విలువైన ఔషధాలను శనివారం విరాళంగా అందించారు.

ఈ మేరకు టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు శనివారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడును కలిసి దాతల తరఫున ఔషధాలను అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.