WORLD NO.1 MUSEUM BY THIS YEAR END-TTD EO_ ప్రపంచంలోనే టాప్ 1 మ్యూజియంగా తిరుమల మ్యూజియం

AUTOMATION MACHINE FOR MAKING LADDUS SOON

ANJANADRI HANUMAN TEMPLE WORKS UNDERWAY

TIRUMALA, 03 FEBRUARY 2023: The State-of-Art museum which is underway in Tirumala would be definitely the world number one which will be completed by this year end, said TTD EO Sri AV Dharma Reddy.

Speaking to media persons after the Dial your EO programme in Tirumala, the EO said, the SV Museum with a new look at Rs.120cr is all set to emerge by December end. “The devotees will have a unique experience and even the 3D imaging jewels will also be displayed”, he added.

The EO also said Reliance has come forward to establish a fully automatic machine for making qualitative and quantitative laddus at Rs. 50 crores. “With this we could be able to provide more hygienic and tastier laddus to devotees”.

Anjanadri temple at Akasa Ganga is also coming up at Rs.50-60cr on donation and the new Parakamani building will become operational from February 5 onwards, the EO added.

Briefing on the replacement of the Acacia plantation in Tirumala, the work is going on with a fast pace and very soon you will see healthy species replacing the Acacia in the Seshachala woods, the EO maintained. 

Giving the details of devotees in the month of January 2023 he said 20.78 lakhs had darshan while  37.38lakh pilgrims had Annaprasadam and 7.51 offered tonsures. The Hundi collection stood at Rs,123.07cr and 1.07 crore laddus were distributed to pilgrims.

RADHASAPTHAMI WITNESSES OVER 2LAKHS PILGRIMS-TTD EO

TIRUMALA, 03 FEBRUARY 2023: Unprecedented pilgirms turned out for the one-day Brahmotsavam, Radhasapthami which took place in a fullfledged manner after two years of Corona pandemic, said TTD EO Sri AV Dharma Reddy.

Before taking phone calls from the pilgrim callers during the live phone-in programme, Dial your EO at Annamaiah Bhavan on Friday, he briefed about some important events that were performed and in pipe-line for the information of the pilgrim devotees. Some excerpts:

About 2lakh pilgrims witnessed all the Saptha Vahana Sevas from dawn to dusk on January 28 and over 8lakhs of Annaprasadams were served to devotees in galleries.

He said TTD has decided to postpone the gold malam works of Ananda Nilayam and is going for global contract to complete the works with finesse within a specific time frame keeping in view the huge pilgrim footfall to Tirumala temple.

The EO also said, the new Mobile App launched by TTD has garnered huge reception from pilgrims as over 10lakhs downloaded the app within 24hours of its launch.

For the first time, TTD is organising Yuva Dharmikotsavam in Asthana Mandapam at Tirumala on February 5, 6 with 2000 youth.

07cr and 1.07 crore laddus were distributed to pilgrims.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు నాటికి ఆటోమేటిక్ లడ్డూ యంత్రాల ఏర్పాటు
– రోజుకు 6 లక్షల దాకా లడ్డూల తయారీకి అవకాశం
– ప్రపంచంలోనే టాప్ 1 మ్యూజియంగా తిరుమల మ్యూజియం

– డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో టీటీడీ ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

 తిరుమల, 2023, ఫిబ్రవరి 03: తిరుమలలో లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియం ను డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు.

తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి , ఆతరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

– జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు.

– లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, టి, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించాం.

– తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుంది. తిరుమలలో స్వామివారి హుండీ కానుకలు లెక్కించడానికి బెంగళూరుకు చెందిన దాత శ్రీ మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనం నిర్మించాం.

– తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నాం. త్వరలో మరో తేదీ నిర్ణయించి తెలియజేస్తాం.

– తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోంది. తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనందనిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నాం. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశాం. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.

– భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిదేవస్థానమ్స్‌ పేరుతో మొబైల్‌ యాప్‌ను ఇటీవల ప్రారంభించాం.

– తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవడంతోపాటు విరాళాలు కూడా అందించవచ్చు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించవచ్చు.

– శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ప్రసారమవుతున్న గరుడపురాణం భక్తుల మన్ననలు పొందుతోంది.


– యువతకు ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో తిరుమల ఆస్థానమండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తాం. దాదాపు 2 వేల మంది యువతీ యువకులు పాల్గొంటారు.

– ఫిబ్రవరి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ.

– ఫిబ్రవరి 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం.

– ఫిబ్రవరి 11 నుండి 19వ తేదీ వరకు ` శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో.

– ఫిబ్రవరి 11 నుండి 20వ తేదీ వరకు ` తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో.

– ఫిబ్రవరి 19 నుండి 27వ తేదీ వరకు ` తొండమనాడులోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో.

– ఫిబ్రవరి 28 నుండి మార్చి 8వ తేదీ వరకు `తరిగొండలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో.

జనవరి నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ` 20.78 లక్షలు.

హుండీ :

– హుండీ కానుకలు ` రూ.123.07 కోట్లు.

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ` 1.07 కోట్లు.

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ` 37.38 లక్షలు.

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 7.51 లక్షలు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.