AKHANDA GITA PARAYANAM ON DECEMBER 4 _ డిసెంబ‌రు 4న  భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం

TIRUMALA, 29 NOVEMBER 2022: In connection with Gita Jayanthi on December 4, Akhanda Gita Parayanam will commence on Nada Neerajanam platform at Tirumala by 7am.

All the 700 shlokas present in the 18 chapters of Bhagavat Gita will be recited which will be telecasted live on SVBC.

Vedic scholars and pundits, Vedic faculty, Veda Parayanamdars and devotees will participate in the mass recitation.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబ‌రు 4న  భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం
 
తిరుమల, 2022 నవంబరు 29: గీతా జ‌యంతిని పుర‌స్క‌రించుకొని  డిసెంబ‌రు 4న తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై సంపూర్ణ భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం నిర్వ‌హించ‌నున్నారు.
 
ఉద‌యం 7 నుండి భ‌గ‌వ‌ద్గీత‌లోని 18 ఆధ్యాయాల్లో గల 700 శ్లోకాలను పండితులు నిరంత‌రాయంగా పారాయ‌ణం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనుంది.
 
అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేద అధ్యాయ‌న సంస్థకు చెందిన వేద పారాయ‌ణదారులు, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం శాస్త్రీయ పండితులు, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
 
భగవద్గీత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు 2020 సెప్టెంబర్ 10వ తేదీ నుండి తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గీతా పారాయణం నిర్వ‌హిస్తున్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.