ACHARYA RANI SADASIVAMURTHY TAKES OVER AS IN-CHARGE VC OF SV VEDIC UNIVERSITY _ శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఇంచార్జ్ విసి గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాణి సదాశివమూర్తి

Tirupati,29 November 2022: Acharya Rani Sadasivamurthy on Tuesday assumed as in-charge Vice Chancellor of SV Vedic University.

His appointment as VC was announced by the Honourable Governor of AP Sri Viswabhushan Harichandan.

Speaking on the occasion, after assuming charges he said that he would strive hard to promote teaching, research and Veda Prachara in the University.

SVVU Registrar Dr AV Radheshyam, Dean academic director Phani Yagneswaryajulu, SO Sri Anji Reddy and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఇంచార్జ్ విసి గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య రాణి సదాశివమూర్తి

తిరుపతి 29 నవంబరు 2022: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ నూతన ఇన్చార్జి కులపతిగా ఆచార్య రాణి సదాశివమూర్తి మంగళవారం బాధ్యతలు చేపట్టారు .

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సాహిత్య విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తూ ప్రస్తుతం డిప్యూటేషన్ పై శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ విభాగం డైరెక్టర్ గా ఆచార్య రాణి సదాశివమూర్తి పనిచేస్తున్నారు . ఆచార్య రాణి సదాశివమూర్తిని ఇంచార్జ్ విసి గా నియమిస్తూ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ , రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈమేరకు మంగళవారం మధ్యాహ్నం ఆయన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి , ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి ని కలసి కృతజ్ఞతలు తెలిపారు . తాత్కాలిక విసి గా వ్యవహరిస్తున్న టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ, వేద విశ్వ విద్యాలయ ఇంచార్జ్ కులపతిగా బాధ్యతలు స్వీకరించటం తన పూర్వజన్మ సుకృతమన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం వలన తనకు ఈపదవి లభించినదని చెప్పారు . టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి , ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపారు.
విశ్వవిద్యాలయం ప్రధానంగా బోధన , పరిశోధన , వేద ప్రచారం అంశాలలో మరింత ముందుకు తీసుకుని వెళ్ళడానికి కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డాక్టర్ ఏవి రాథేశ్యామ్, డీన్ అకాడమిక్ డాక్టర్ ఫణియజ్ఞేశ్వరయాజులు ,ఎఫ్ ఓ శ్రీ అంజిరెడ్డి ఏఆర్ సుబ్రహ్మణ్యం పిఆర్ఓ డాక్టర్ టి.బ్రహ్మాచార్యులు విభాగాధిపతులు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది