TTD SPECIFIED AUTHORITY HOLDS MAIDEN MEETING _ డిసెంబ‌ర్ 20 నుండి 29వ తేదీ వ‌ర‌కు 8.34 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

Tirumala, 18 November 2026:The Specified Authority of TTD with its Chairman Sri M Ravichandra and members Sri Vinaychand and Kannababu held the maiden board meeting at Annamayya Bhavan in Tirumala on Wednesday evening.

Key Decisions:

•  Top priority to 92% of common devotees during the ensuing 10day Vaikuntha Dwara Darshanam from December 20-29. Aim is to provide hassle free darshan to 8.34lakh devotees during these 10 days. SSD tokens will be released online only for Vaikuntha Ekadasi and Dwadasi days. No sarva darshan on the first two days.  Devotees will be allowed for Sarva Darshan on the remaining eight days.

•  In the larger interests of multitude of devotees visiting Tirumala, it has been decided  to select a consultancy firm for the preparation of a Detailed Project Report (DPR), designs and project supervision of the proposed pilgrim township to be developed on TTD land near the Alipiri–SV Zoo Park Road, Tirupati, with an investment of Rs.2,750 crore from Srivani Trust funds. The township will provide improved accommodation and modern infrastructure facilities for pilgrims.

•  Approved the allotment of residential plots at Pallam village under Phase-III to retired employees, pensioners and their legal heirs based on the 2007 seniority list. Decided to constitute a special committee to examine the allotment of plots to other eligible employees. Also approved the confirmation of Rs.230 crore already allocated for the development of residential plots at Padiredu, with TTD bearing 65% and employees/allottees contributing 35% of the cost.

*  Approved the recruitment of an additional 348 personnel, including 321 sanitation workers and 27 supervisors, on an outsourcing basis to further improve sanitation in Tirumala.

*  Approved the establishment of a dedicated Environmental Protection Wing to develop Tirumala as a pollution-free, Net Zero and Carbon Neutral Destination. Retired Chief Engineer T.V. Satyanarayana will be appointed for a period of one year for this purpose.

•  Sanctioned Rs.7.50 crore towards the purchase and transportation of 500 indigenous breed cows to meet the daily requirement of 2,000 litres of milk and 80 kg of ghee for the daily rituals and kainkaryams of Sri Venkateswara Swamy.

•  Approved financial assistance of Rs.16.40 crore to the Andhra Pradesh Forest Department for a period of two years (2026–2028) towards preventing human-wildlife conflicts, ensuring pilgrim safety and protecting wildlife in the forest areas of Tirumala and Tirupati.

•  Approved Rs.9.50 crore for road development and construction of interlocking cement block pathways on both sides of the road connecting Sri Kalyana Venkateswara Swamy Temple at Srinivasa Mangapuram to Srivari Mettu, to facilitate the convenient movement of pilgrims.

•  Decided to provide the annual Brahmotsavam gift to TTD employees for this year at the rate of Rs.16,940 per permanent employee and Rs.8,289 per contract and outsourcing employee.

•  Sanctioned an additional special grant of Rs.41.23 crore to SVIMS Hospital to provide better-quality medical services to poor patients and clear pending dues.

•  Enhanced seats in the existing 40 to 60 in BAMS(UG)course in SV Ayurvedic college for the benefit of students willing to pursue the course.

•  Decided to enhance the monthly Sambhavana (honorarium) for the reciters performing the Nalayira Divya Prabandham Parayanam at Srivari Temple to encourage and support their services.

•  Approved the construction of a new hostel building for the students of Sri Venkateswara Institute of Traditional Sculpture and Architecture (SVITSA), located near Alipiri in Tirupati, at an estimated cost of Rs.23 crore in a spacious area of 41,167sq ft which will accommodate 229 students.

•  Approved the L-1 tender of M/s Patil Parimal Works Limited, Bengaluru, for the manufacturing, packaging and supply of incense sticks at the TTD Agarbathi Unit for a period of three years, at an estimated cost of approximately Rs.90 crore, including GST.

•  Approved the financial assistance of Rs.15 lakh to EMTS employee S. Chandrasekhar, who sustained severe injuries in an elephant attack while on duty at Tiruchanur Gosala and subsequently passed away. Also approved financial assistance of Rs.10 lakh each to the families of two other recently deceased TTD employees, Sri K. Chakravarthy and Sri S. Chandrasekhar. Further, decided to implement a comprehensive employee welfare policy covering gratuity, insurance and ex-gratia benefits to ensure a minimum financial benefit of Rs.10 lakh to the families of eligible employees in the event of their death.  

•  Contemplating the possibility of constructing a cable bridge for the sake of pedestrian pilgrims from Sri Lakshmi Narasimha Swamy temple to Mokalimettu taking the technical assistance of IIT Chennai.

•  With an aim to provide job opportunities, it is being contemplated to offer the students free training in skill development under SV Vidyadana Trust and proposals are underway to construct skill development centres at IIT Tirupati and SVITSA 

Among other officials, the Additional EO of TTD Sri Ch Venkaiah Chowdary, JEOs Dr Sharath, Sri Gopinadh, CVSO Sri Muralikrishna and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

డిసెంబ‌ర్ 20 నుండి 29వ తేదీ వ‌ర‌కు 8.34 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

సామాన్య భ‌క్తుల‌కు 92% ప్రాధాన్య‌త 

రూ.2,750 కోట్లతో నిర్మించ‌నున్న‌యాత్రికుల టౌన్‌షిప్ కోసం డీపీఆర్, డిజైన్ల తయారీ

టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం

స్విమ్స్‌కు అదనంగా రూ.41.23 కోట్ల ప్రత్యేక గ్రాంటు

తిరుమ‌ల‌, 2026 న‌వంబ‌రు 18: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 20 నుండి 29వ తేదీ వ‌ర‌కు 8.34 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు అన్ని విభాగాల స‌మ‌న్వ‌యంతో ప్ర‌ణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు టీటీడీ సాధికారిక మండ‌లి ఛైర్మ‌న్ శ్రీ ముద్దాడ ర‌విచంద్ర తెలిపారు.

తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం సాయంత్రం టీటీడీ సాధికారిక మండ‌లి స‌మావేశం జ‌రిగింది. 

ఈ సంద‌ర్భంగా టీటీడీ సాధికారిక మండ‌లి ఛైర్మ‌న్  శ్రీ ముద్దాడ ర‌విచంద్ర మీడియాతో మాట్లాడుతూ….. 

•  వైకుంఠ ఏకాద‌శికి సామాన్య భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి రోజుల‌కు సంబంధించి SSD టోకెన్ల‌ను ఆన్ లైన్ లో విడుద‌ల చేస్తాం. తొలి రెండు రోజులు స‌ర్వ ద‌ర్శ‌నం ఉండ‌దు. త‌ర్వాత 8 రోజులు భ‌క్తుల‌కు స‌ర్వ ద‌ర్శ‌నం అమ‌లు చేయ‌డం జ‌రుగుతుంది. 

•  అలిపిరి–ఎస్.వి. జూ పార్క్ రోడ్డుకు స‌మీపంలోని టీటీడీ స్థలంలో రూ.2,750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మించ‌నున్న యాత్రికుల టౌన్‌షిప్ కోసం డీపీఆర్, డిజైన్ల తయారీ, ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయాలని నిర్ణయం. ఇందులో భక్తులకు మెరుగైన వసతి, ఆధునిక మౌలిక సదుపాయాలు క‌ల్పించ‌నున్నారు.

•  టీటీడీ ఉద్యోగుల‌కు ఇంటి స్థ‌లాలు కేటాయింపులో భాగంగా సీనియారిటీ జాబితా 2007 ఆధారంగా ఫేజ్-IIIలో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి వారసులకు పల్లం గ్రామంలో ప్లాట్లు కేటాయించడానికి ఆమోదం. దీంతోపాటు మిగిలిన అర్హులకు కేటాయింపు పరిశీలనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. అదేవిధంగా  పాదిరేడులో ఇంటిస్థ‌లాల అభివృద్ధిలో భాగంగా (టీటీడీ 65 శాతం, ఉద్యోగులు/కేటాయింపుదారులు 35 శాతం) ఇప్ప‌టికే కేటాయించిన రూ.230 కోట్ల ధృవీక‌ర‌ణ‌కు ఆమోదం.

•  తిరుమలలో పారిశుద్యాన్ని మ‌రింత మెరుగు ప‌ర‌చేందుకు అదనంగా 321 మంది పారిశుధ్య కార్మికులు, 27 మంది సూపర్ వైజర్లు కలిపి పొరుగు సేవ‌ల క్రింద‌ మొత్తం 348 మంది అదనపు సిబ్బంది నియామకానికి ఆమోదం.

•  తిరుమలను కాలుష్య ర‌హిత ప్రాంతంగా (Net Zero and Carbon Neutral Destination) అభివృద్ధి చేసేందుకు ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ప్ర‌త్యేక విభాగం ఏర్పాటుకు ఆమోదం. ఇందుకోసం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ టి.వి. సత్యనారాయణను ఏడాది పాటు నియమించేందుకు నిర్ణ‌యం.

•  శ్రీ‌వారి నిత్య కైంక‌ర్యాల‌కు ప్ర‌తిరోజూ అవ‌స‌ర‌వ‌మైన 2000 లీట‌ర్ల పాలు, 80 కిలోల నెయ్యిని సొంతంగా స‌మ‌కూర్చుకునేందుకు 500 దేశీయ జాతి గోవుల కొనుగోలు వాటి ర‌వాణాకు రూ.7.50 కోట్లు మంజూరు.

•  తిరుమల–తిరుపతి అటవీ ప్రాంతాల్లో మానవ–వన్యప్రాణుల సంఘర్షణల నివారణ, భక్తుల భద్రత, వన్యప్రాణుల సంరక్షణ కోసం (2026-2028) రెండేళ్ల కాలానికి ఏపీ అటవీ శాఖకు రూ.16.40 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు ఆమోదం.

•  శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుంచి శ్రీవారిమెట్టు వరకు భక్తుల రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రహదారి అభివృద్ధి, ఇరువైపులా ఇంటర్ లాకింగ్ సిమెంట్ బ్లాక్‌ల నిర్మాణానికి రూ.9.50 కోట్లు మంజూరుకు ఆమోదం.

•  ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం ఉద్యోగులకు అందించే బ్రహ్మోత్సవ బహుమానాన్ని ఈ ఏడాది టీటీడీ పర్మినెంట్ ఉద్యోగులకు రూ.16,940, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రూ.8,289 చొప్పున ఇవ్వాలని నిర్ణయం.

•  శ్రీవారి ఆలయంలో నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ సేవలు నిర్వహిస్తున్న పారాయణదారులను ప్రోత్సహించేందుకు గాను వారికి సంభావన పెంపునకు నిర్ణ‌యం.

•  స్విమ్స్ ఆసుప‌త్రిలో పేద రోగులకు మ‌రింత నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం అదనంగా రూ.41.23 కోట్ల ప్రత్యేక గ్రాంటు మంజూరు.

•  ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల‌లో విద్యార్థుల సౌక‌ర్యార్థం ప్ర‌స్తుతం ఉన్న బిఏఎమ్ ఎస్( UG) కోర్సులో ప్ర‌స్తుతం ఉన్న 40 సీట్ల‌కు అద‌నంగా మ‌రో 20 సీట్లు పెంచేందుకు ఆమోదం. 

•  తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ శిల్పకళా, వాస్తుశిల్ప సంస్థ (SVITSA)లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు మ‌రింత మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు 41,167 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో రూ.23 కోట్లతో నూతన హాస్టల్ భ‌వ‌నం నిర్మాణం చేప‌ట్టేందుకు ఆమోదం. త‌ద్వారా 229 మంది విద్యార్థుల‌కు హాస్ట‌ల్ వ‌స‌తి అందుబాటులోకి వ‌స్తుంది.

•  టీటీడీ అగరుబత్తి యూనిట్‌లో తయారీ, ప్యాకేజింగ్, సరఫరా కోసం బెంగళూరుకు చెందిన మెస్సర్స్ పాటిల్ పరిమళ వర్క్స్ లిమిటెడ్‌కు మూడేళ్ల కాలానికి జీఎస్టీతో కలిపి సుమారు రూ.90 కోట్ల అంచనా వ్యయంతో ఎల్‌–1 టెండర్‌ ఆమోదం.

•  తిరుచానూరు గోశాలలో విధి నిర్వహణలో ఏనుగు దాడికి గురై తీవ్రంగా గాయపడి మ‌ర‌ణించిన ఈఎంటీఎస్ ఉద్యోగి ఎస్. చంద్రశేఖర్‌కు 15 ల‌క్ష‌లు, అదేవిధంగా ఇటీవ‌ల మ‌ర‌ణించిన మ‌రో ఇద్ద‌రు టీటీడీ ఉద్యోగులు శ్రీ కె.చ‌క్ర‌వ‌ర్తి,  శ్రీఎస్‌.చంద్ర‌శేఖ‌ర్‌ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అంద‌జేసిన నిధుల‌కు  ఆమోదం. భవిష్యత్తులో అర్హులైన ఉద్యోగుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఆర్థిక ప్రయోజనం అందేలా గ్రాట్యుటీ, బీమా, EX-Gratia తో సమగ్ర సంక్షేమ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం.

•  అలిపిరి నడకమార్గంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్లమిట్ట వరకు రోడ్డుపై నడిచివచ్చే భక్తుల సౌకర్యార్థం ఐఐటీ నిపుణులు సహకారంతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం.

•  ఎస్వీ విద్యాదాన ట్రస్టు ఆధ్వర్యంలో తిరుపతి ఐఐటీలో ఒకటి, అలిపిరిలోని శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ శిల్పకళాశాల ప్రాంగణాల్లో మరో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ అందించి, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యం.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. కన్నబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ వి. వినయ్‌చంద్, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవోలు డా. ఏ. శరత్, శ్రీ ప్రభల గోపినాథ్, సీవీఎస్‌వో శ్రీ మురళీకృష్ణ, చీఫ్ ఇంజినీర్ శ్రీ మనోహరం, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.