TTD EDUCATIONAL INSTITUTIONS ENSURE BETTER FACILITIES FOR CHILD WELFARE AND SAFETY _ బాలల సంక్షేమం, భద్రతకు టీటీడీ విద్యాసంస్థల్లో మెరుగైన సదుపాయాలు
STATE CHILD RIGHTS COMMISSION APPRECIATES TTD’S MANAGEMENT OF EDUCATIONAL INSTITUTIONS
Tirupati, November 18, 2026: The Chairperson of the Andhra Pradesh State Commission for Protection of Child Rights, Sri A.V.S. Surya Narayana Raju, along with commission members, visited TTD’s Sri Venkateswara Balamandir and Sri Padmavathi Girls High School in Tirupati on Wednesday.
They inspected the kitchen, store and records at Balamandir and appreciated the cleanliness, proper maintenance and systematic record-keeping.
The team also reviewed the educational, safety and welfare facilities provided to students and appreciated TTD’s efforts towards protecting child rights and ensuring their overall well-being.
Commission Member Sri Gandhi Babu, District Child Protection Officer Sri V. Siva Sankar, Protection Officer Smt. J. Devayani, TTD AEO Smt. B. Ammulu, Headmistress Smt. Padmavathamma and other officials participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
బాలల సంక్షేమం, భద్రతకు టీటీడీ విద్యాసంస్థల్లో మెరుగైన సదుపాయాలు
టీటీడీ విద్యాసంస్థలను సందర్శించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్, సభ్యులు
టిటిడి విద్యాసంస్థల నిర్వహణపై ప్రశంసలు
తిరుపతి, 2026 నవంబరు 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ శ్రీ ఏ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు, కమిషన్ సభ్యుల బృందం బుధవారం తిరుపతిలోని టీటీడీ విద్యాసంస్థలైన శ్రీ వేంకటేశ్వర బాలమందిరం, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించింది.
ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర బాలమందిరంలోని వంటశాల, స్టోర్‌ను పరిశీలించి, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. వంటశాల, స్టోర్‌లో పాటిస్తున్న పరిశుభ్రత, క్రమబద్ధమైన నిర్వహణ, రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు.
అనంతరం ఇతర విద్యాసంస్థలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్యా, సంరక్షణ, సంక్షేమ సదుపాయాలను పరిశీలించారు. బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, సమగ్ర సంక్షేమం కోసం టీటీడీ చేపడుతున్న చర్యలను సమీక్షించారు.
ఈ పర్యటనలో కమిషన్ సభ్యులు శ్రీ గాంధీ బాబు, జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీ వి. శివశంకర్, సంరక్షణ అధికారి శ్రీమతి జె. దేవయాని, టిటిడి ఏఈవో శ్రీమతి బి. అమ్ములు, హెడ్మాస్టర్ శ్రీమతి పద్మావతమ్మ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


