SRIVARI SPECIAL DARSHAN FOR AGED, CHALLENGED AND PARENTS WITH INFANTS ON DECEMBER 17 AND 18 _ డిసెంబ‌రు 17న‌ వృద్ధులు, దివ్యాంగులకు, 18న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

Tirumala, 16 Dec. 19: With an intent to provide smooth darshan of Lord Venkateswara to aged, physically challenged and parents with five year old children, TTD has earmarked two days during lean season in a month for their their benefit.

TTD appealed that such persons should utilize the opportunity instead of visiting Tirumala during crowded days.

As part of the above objective, TTD is issues 4000 tokens to senior citizens above 65 years and challenged persons on Tuesday, December 17 in three slots at 10am (1000 tokens), 2pm (2000 tokens) and 3 PM (1000 tokens).

Similarly, for parents with children of five years and less, TTD issues tokens for darshan through Supatham from morning 9.00 am – 1.30 PM on December 18, as against the daily practice of allowing only one year infants with parents through the Supatham gate.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

డిసెంబ‌రు 17న‌ వృద్ధులు, దివ్యాంగులకు, 18న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

డిసెంబరు 16, తిరుమల, 2019: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.

ఇందులో భాగంగా  డిసెంబ‌రు 17న మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

అదేవిధంగా, డిసెంబ‌రు 18న బుధ‌వారం 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.