SEALED TENDERS INVITED FOR DISPOSAL OF FOREIGN COINS _ విదేశీ నాణేల త‌ర‌లింపున‌కు సీల్డ్ టెండ‌ర్లు ఆహ్వానం

విదేశీ నాణేల త‌ర‌లింపున‌కు సీల్డ్ టెండ‌ర్లు ఆహ్వానం

తిరుపతి, 2019 డిసెంబరు 16: టిటిడి ఖ‌జానా విభాగంలో ఉన్న విదేశీ నాణేల త‌ర‌లింపున‌కు అర్హ‌త గ‌ల బ్యాంకులు, అధీకృత ఫారిన్ ఎక్సేంజి డీల‌ర్ల నుండి సీల్డ్ టెండ‌ర్లు ఆహ్వానించ‌డ‌మైన‌ది.
 
తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంతో పాటు ఇత‌ర టిటిడి ఆల‌యాల్లో భ‌క్తులు హుండీ ద్వారా స‌మ‌ర్పించిన విదేశీ నాణేల‌ను ఖ‌జానా విభాగంలో భ‌ద్ర‌ప‌రిచారు. ఇందులో మ‌లేసియా, యుఎస్ఏ, యుకె, యూరో, యుఏఇ, సింగ‌పూర్‌, ఆస్ట్రేలియా, కెన‌డా, శ్రీ‌లంక‌, కువైట్‌, బ‌హ్రెయిన్‌, థాయిలాండ్‌, నేపాల్‌, మాల్దీవులు, న్యూజిలాండ్‌, హాంగ్‌కాంగ్‌, ఖ‌తార్, ఓమ‌న్ త‌దిత‌ర దేశాల నాణేలున్నాయి.
 
డిసెంబ‌రు 27న తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గల డెప్యూటీ ఈవో(ట్రెజ‌రీ మ‌రియు ఇన్వెంట‌రీ) కార్యాల‌యంలో సీల్డ్ టెండ‌ర్లు తెరుస్తారు. ఇత‌ర వివ‌రాల‌కు టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.